America చదువులకు మన దేశ చదువులకు తేడా ఏమిటి? ఎందుకు అమెరికాలో చదువుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటారు? మీకు మరి పూర్తిగా తెలుసో లేదో తెలుగు వాళ్ళు ఎక్కువగా అమెరికా ని ఇష్టపడతారు. తమిళులు సింగపూర్ లేదా మలేసియాకి, మలయాళీలు గల్ఫ్ దేశాలకు, పంజాబ్ – హర్యానా వాళ్ళకు లండన్, చాలా ఉత్తరదేశీయులు కెనడా ఇలా ఒక్కో రాష్ట్రం ఒక్కో దేశాన్ని ఎంచుకుంది.
విద్యావిధానం ఎలా ఉంటుంది అన్నది పక్కన పెట్టండి, సందుకు వంద కాలేజీలు మనలాగే అక్కడ కూడా కుప్పలు తెప్పలు, ఆ రెండేళ్ళు అప్పు చేసి పార్ట్ టైమ్ ఉండయోగం చేసి చిన్న ఉద్యోగం సంపాదిస్తే ఉభయ గోదావరిలో కట్నం బాగా పలుకుతుంది అనే ఆలోచన కొందరికి ఉంటుంది. కొందరు అక్కడ చదివాం అన్న గొప్పకి వెళతారు, కొందరు నిజంగానే ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో రిసెర్చ్ కోసం వెళ్ళేవారు ఉంటారు.
విద్యావిధానంలో అక్కడి ప్రొఫెసర్స్ అయితే కనుక విషయాన్ని చెప్పే విధానం మన కన్నా కొంత మెరుగుగా ప్రాక్టికల్ గా ఉంటుంది. అంతే కాక మనకు ఉండే అవకాశాల కన్నా వాళ్ళు ఇంకా ఎక్కువ అందిస్తారు. ఉదాహరణకి ఒక సిలికాన్ వాలి లాంటిది. నేను ఐఐఏం లో ఎందుకు పనికిరాని డబ్బా ప్రొఫెసర్స్ ని చూశాను, మనకు తెలియని విషయాలను ఇంకా చక్కగా వివరించే అధునాతన పద్దతులతో బోధించే వారిని కూడా చూశాను. ఇది విడిగా వారికి ఉండే అభిమానం అనుకోవచ్చు. ఒకపుడు స్కూల్ లో విద్యార్ధికి ఉపాధ్యాయులకు ఎలాంటి బంధం ఉండేది, ఈ రోజు అది లేదుగా.