Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

అతిగా శృంగారం చేయ‌డం వ‌ల్ల బ‌ట్ట‌త‌ల‌, హార్ట్ ఎటాక్ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయా ? నిజ‌మెంత ?

Admin by Admin
December 10, 2021
in వైద్య విజ్ఞానం
Share on FacebookShare on Twitter

శృంగారంలో పాల్గొన‌డం అనేది ప్ర‌కృతి ధ‌ర్మం. దంప‌తులిద్ద‌రూ క‌లిసిపోయే ప్ర‌కృతి కార్యం. దాని గురించి మాట్లాడుకునేట‌ప్పుడు సిగ్గు ప‌డాల్సిన ప‌నిలేదు. అయితే శృంగారంలో త‌ర‌చూ పాల్గొంటే మాన‌సిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంద‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు. కానీ అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌యేత్ అన్న‌ట్లుగా దేన్నీ అతిగా తీసుకోరాదు. అతిగా చేయ‌రాదు. ఆ సూత్రం శృంగారానికి కూడా వ‌ర్తిస్తుంది. అతిగా శృంగారం చేస్తే కొన్ని స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అదేమిటంటే..

అతిగా శృంగారం చేయ‌డం వ‌ల్ల బ‌ట్ట‌త‌ల‌, హార్ట్ ఎటాక్ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయా ? నిజ‌మెంత ?

శృంగారం అతిగా చేయ‌డం వ‌ల్ల స్త్రీ, పురుషులు ఇరువురిలోనూ మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్లు ఎక్కువ‌గా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అతిగా శృంగారం వ‌ల్ల కొంత కాలానికి అందులో ఆస‌క్తి స‌న్న‌గిల్లుతుంది. శృంగారం అంటేనే విర‌క్తి ఏర్ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. దంప‌తులిద్ద‌రిలో ఎవ‌రైనా ఒక‌రు అతిగా శృంగారం చేయ‌మ‌ని ఫోర్స్ చేస్తే ఇంకొక‌రికి తీవ్ర‌మైన ఇబ్బందులు క‌లుగుతాయి. మాన‌సికంగా కుంగి పోతారు. దీంతో ఇద్ద‌రూ విడిపోయేందుకు కూడా అది కార‌ణ‌మ‌వుతుంది.

అయితే శృంగారం అతిగా చేస్తే బ‌ట్ట‌త‌ల వ‌స్తుంద‌ని, హార్ట్ ఎటాక్‌లు వ‌స్తాయ‌ని.. కొంద‌రు న‌మ్ముతుంటారు. కానీ అందులో నిజం లేదు. అంటే.. కొంత వ‌ర‌కు స‌త్యం ఉంది.

సాధార‌ణంగా పురుషుల్లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ రోజూ డై హైడ్రోటెస్టోస్టిరాన్‌గా మారుతుంది. ఇది పురుషుల‌కు పురుష ల‌క్ష‌ణాలు ఉండేలా చేస్తుంది. స‌రాస‌రి రోజుకు టెస్టోస్టిరాన్ లో 10 శాతం డై హైడ్రోటెస్టోస్టిరాన్ గా మారుతుంది. అయితే ఇది వ్య‌క్తుల‌ను బ‌ట్టి మారుతుంది.

టెస్టోస్టిరాన్ ఎక్కువ‌గా ఉన్న‌వారిలో డై హైడ్రోటెస్టోస్టిరాన్ కూడా ఎక్కువ‌గానే ఉత్ప‌త్తి అవుతుంది. అలాంటి వారిలో జుట్టుకు పోష‌ణ ల‌భించ‌దు. దీంతో వారికి బ‌ట్ట‌త‌ల వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఇక డై హైడ్రోటెస్టోస్టిరాన్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల గాయాలు నెమ్మ‌దిగా మానుతాయి. ప్రోస్టేట్ గ్రంథి వాపుల‌కు గుర‌వుతుంది. ప్రోస్టేట్ క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. గుండె జ‌బ్బులు కూడా రావ‌చ్చు. కానీ.. డై హైడ్రోటెస్టోస్టిరాన్ కు, అతిగా శృంగారం చేసేందుకు సంబంధం లేదు.

టెస్టోస్టిరాన్ స్థాయిలు సాధార‌ణంగా ఉన్న‌వారు కూడా కొంద‌రు అతిగా శృంగారం చేస్తారు. కానీ దాంతో బ‌ట్ట‌త‌ల రాదు. కానీ టెస్టోస్టిరాన్ ఎక్కువ‌గా ఉంటే డై హైడ్రోటెస్టోస్టిరాన్ కూడా ఎక్కువ‌గానే ఉత్ప‌త్తి అవుతుంది. క‌నుక అలాంటి వారికి జుట్టు రాలిపోయి బ‌ట్ట‌త‌ల వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఇది సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

ఇక అతిగా శృంగారం చేస్తే హార్ట్ ఎటాక్‌లు వ‌స్తాయ‌న్న మాట కూడా నిజ‌మే. ఈ విష‌యాన్ని కూడా సైంటిస్టులు వెల్ల‌డించారు. కానీ ఇది చాలా అరుదుగా జ‌రుగుతుంది. ఎక్క‌డో ఒక్క‌రికి అలా జ‌రుగుతుంది. కానీ అంద‌రికీ జ‌రుగుతుంద‌ని చెప్ప‌లేం. అందువ‌ల్ల అతి శృంగారం ప‌నికిరాదు. ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో శృంగారం చేయాల్సి ఉంటుంది. రోజుకు 3 సార్ల వ‌ర‌కు శృంగారంలో పాల్గొన‌డం ఆరోగ్య‌క‌రం అని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక అంత‌కు మించ‌కుండా చూసుకుంటే చాలు, ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Tags: బ‌ట్ట‌త‌లశృంగారంహార్ట్ ఎటాక్‌
Previous Post

నేల‌పై కూర్చుని భోజ‌నం చేస్తే ఆయుష్షు పెరుగుతుంద‌ట‌.. ఇంకా ఏమేం లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

Next Post

రాత్రి నిద్ర‌పోలేద‌ని చెప్పి మ‌ధ్యాహ్నం నిద్రిస్తున్నారా ? అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

Related Posts

వైద్య విజ్ఞానం

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

నీళ్ల‌ను త‌గిన మోతాదులో తాగ‌క‌పోతే జ‌రిగే అన‌ర్థాలు ఇవే..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

రోజూ స‌రిగ్గా నిద్ర పోవ‌డం లేదా..? అయితే ఏం జ‌రుగుతుందంటే..?

July 20, 2025
వైద్య విజ్ఞానం

ఐస్ లేదా హీట్ ప్యాక్‌ల‌ను ఏయే నొప్పుల‌కు పెట్టాలో తెలుసా..?

July 19, 2025
వైద్య విజ్ఞానం

పొగ తాగడం వ‌ల్ల గుండెకు ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుందో తెలుసా..?

July 19, 2025
వైద్య విజ్ఞానం

గొంతులో తెమ‌‌‍‌డ ఏర్పడటం ఏమిటి? నివారణ ఏమైనా ఉందా?

July 19, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.