Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు అర్థ‌నారీశ్వ‌రుడు ఎలా అయ్యాడు..?

Admin by Admin
July 13, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇన్ యాంగ్ అంటే స్థూలంగా చీకటి వెలుగుల సమతుల్య సంగమం అని చెప్పవచ్చు. చీకటి వెలుగూ స్త్రీ పురుషులిద్దరిలో ఉంటాయి. ఒకరి వెలుగులో ఒకరు నిండిపోవడం ఒకరి చీకటిలో ఒకరు సేద తీరడం జీవన సూత్రం. అదే హిందూ జీవన విధానంలో అర్ధనారీశ్వర తత్వంగా చెప్పబడినది. ఇవన్నీ పరస్పర ప్రేమను దంపతు మధ్య బాంధవ్యం ఉండవలసిన తీరునూ అంతర్లీనంగా బోధిస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రపంచం పుట్టినప్పుటి నుండీ ఉన్నవే . తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత.. ఆది దంపతులు – జగత్పితరులు జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని స్తుతిస్తుంటారు. జగత్తుకంతటికీ తల్లిదండ్రులలాంటి వారు ఆ పార్వతీపరమేశ్వరులు. ఈ ఆది దంపతులు ఇద్దరూ దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంతో కన్పించటం కూడా అందరికీ తెలిసిందే.

ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటీ? అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ కథాసందర్భం. ఇది పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయటం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతకాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతిల్లిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. సగం పురుషుడు, సగం స్త్రీ రూపం గల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది. పరమ శక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు.

how lord shiva became ardha nareeshwar

అలా పలుకుతున్న శివుడి పార్శ్వ భాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ జగనాత్మను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని, తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు.ఆమె బ్రహ్మను అనుగ్రహించింది. ఆ వెంటనే భవానీదేవి కనుబొమల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది. బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది.

సృష్టి ఆవిర్భావం స్త్రీ, పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుంచి ప్రవర్తిల్లింది. స్త్రీ శక్తి సామాన్యమైనది కాదని, ప్రతివారు స్త్రీ మూర్తులను గౌరవించి తీరాలని ఆదిదేవుడు, ఆదిపరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కథాసందర్భం వివరిస్తుంది. సృష్టి ఆవిర్భావం అంతేకాక స్థితి, లయ కారకులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేక పోయిందని, పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తోంది. సృష్టి ఆవిర్భావం స్త్రీ శక్తి విశిష్టతను తెలియచెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు. కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించటం కానీ, స్త్రీలను, స్త్రీ శక్తిని కించపరచటం కానీ ఎంతమాత్రం దైవహితం కాదనే విషయాన్ని ఈ కథలో మనం గమనించవచ్చు.

Tags: lord shiva
Previous Post

ఎలాంటి ప్ర‌మిద‌తో దీపారాధ‌న చేస్తే ఏ ఫ‌లితం క‌లుగుతుందో తెలుసా..?

Next Post

పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.