రాగి (కాపర్) మన శరీరానికి ఎంతో అవసరం.. దీని ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.. రాగి అందాలంటే ఇవి తీసుకోవాలి..!
మన శరీరానికి కావల్సిన అనేక రకాల పోషకాల్లో రాగి ఒకటి. ఇది మన శరీరంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అనేక జీవక్రియలను నిర్వర్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది. రాగి వల్ల మన శరీరానికి ఎంతగానో ఉపయోగం ఉంటుంది. రాగితో ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో, రాగి అందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెదడు యాక్టివ్‌గా పనిచేయాలంటే రాగి ఎంతో అవసరం అవుతుంది. దీని వల్ల మతిమరుపు సమస్య రాకుండా నివారించవచ్చు. రాగి వల్ల రక్తహీనత రాకుండా అడ్డుకోవచ్చు….