అవసరమయ్యే దాని కన్నా ఎక్కువగా, అతిగా నీటిని తాగుతున్నారా ? అయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకోండి..!
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో రోజూ తగినంత నీటిని తాగడం అంతే ముఖ్యమని వైద్యులు చెబుతుంటారు. రోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుంది. లేదా దాహం అయిన మేర నీటిని తాగాలి. కానీ కొందరు నీటిని ఎక్కువగా తాగుతుంటారు. నీటిని ఎక్కువగా తాగకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయోమోనన్న భయంతోనే వారు అలా చేస్తుంటారు. కానీ అలా నీటిని ఎక్కువగా తాగడం ప్రమాదకరం. దాంతోనూ అనారోగ్య…