రోగ నిరోధక శక్తికి, గుండె ఆరోగ్యానికి ఆవనూనె.. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి..!
మనకు వాడుకునేందుకు అనేక రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆవనూనె ఒకటి. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. అందువల్ల ఆవనూనె మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఆవనూనెలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆవనూనెలో ఆల్ఫా-లినోలీనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది…