కాలం చెల్లిన డొక్కు బస్సులు పక్కకు.. కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్న తెలంగాణ ఆర్టీసీ..
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆర్‌టీసీని మరింత బలోపేతం చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇక ఇందులో భాగంగా త్వరలో ఆర్టీసీలో కొత్త బస్సులను అందుబాటులోకి తేనున్నారు. మొత్తం 422 కొత్త బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఈ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. 294 పల్లె వెలుగు, 88 మెట్రో డీలక్స్, 17 ఎక్స్‌ప్రెస్,…