వాంతికి వచ్చినట్లు ఉండడం, వికారం వంటి సమస్యలు తగ్గాలంటే ఈ చిట్కాలను పాటించండి..!
వాంతి కలుగుతోందంటేనే ఎంతో చికాకుగా వుంటుంది. కాని కొన్ని సందర్భాలలో వాంతులు, వికారాలు వచ్చి తీరతాయి. అటువంటపుడు ఏ రకమైన చర్యలు చేపట్టాలో పరిశీలించండి. నూనె వస్తువులు, బజారు తయారీలు తినకండి. అవి అరుగుదల కష్టం. ద్రవపదార్ధాలు అధికంగా తీసుకోండి. నిమ్మరసం, కొబ్బరినీరు, మజ్జిగ మొదలైనవి మీ జీర్ణ వ్యవస్ధను శుభ్రం చేసి హాయిగా వుంచుతాయి. ప్రయాణంలో వికారం కలిగితే చాలావరకు అది మానసికం. ప్రయాణానికి కొద్ది గంటల ముందే ఆహారం తీసుకోండి. జీర్ణం అయ్యేందుకు ఒక…