మహిళలు పీరియడ్స్ నొప్పులు తగ్గేందుకు డార్క్ చాకొలెట్ తినాలట..!
మహిళలకు వచ్చే నెలసరి రుతుక్రమంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ స్ధాయిలు తగ్గుతాయి. ఈ సమయంలో వీరికి కడుపులో నొప్పులు, కోపతాపాలు అధికమవుతాయి. ఎంతో చికాకుగా వుంటారు. క్షణ క్షణానికి మూడ్ మారుతూంటుంది. దీనికి కారణం హార్మోన్లలో వచ్చే మార్పులు. హాయిని కలిగించే సెరోటోనిన్ తగ్గిపోవటం. ఎండార్ఫిన్లు మాయమవటం. తీవ్ర మనోవేదన కలిగి వుంటారు. మరి వీరి పరిస్ధితిని అదుపులో వుంచి ఆనందపరచాలంటే…కొన్ని చిట్కాలు చూడండి. ఈ పిరీయడ్స్ పరిస్ధితిని అదుపులో వుంచేవి బెర్రీలు, కాల్షియం, విటమిన్ ఇ, బి…