అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?
మహాభారతంలో అసంఖ్యాకమైన పాత్రలున్నాయి. వారిలో కొందరికి ఒకటికంటే ఎక్కువ పేర్లున్నాయి. భీష్ముడికి చాలా పేర్లున్నాయి. అర్జునుడికి పది పేర్లున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం కురుస్తూ వాతావరణం భయానకంగా ఉంటే అర్జున ఫల్గున పార్థ కిరీటి… అనే అర్జునుడి పది పేర్లను స్మరించినట్లయితే పిడుగుల భయం తొలగి, ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని వెనకటితరంలో పెద్దలు చెప్పేవారు. అలా చేసేవారు కూడా. అది ఒక నమ్మకం, ఈ తరానికి తెలియని విషయం. పాండవులు విరాటుడి కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు…