Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

వినాయ‌కుడు బ్ర‌హ్మ‌చారి క‌దా.. ఆయ‌న‌కు ఇద్ద‌రు భార్య‌లు ఎలా అయ్యారు..?

Admin by Admin
June 27, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వినాయకుని పుట్టుక గురించి అందరికీ తెలిసిన కథ సంగతి అలా ఉంచితే, మనకు తెలియని కథలెన్నో ఉన్నాయి. అసలు ప్రాచీన పురాణ వర్ణనలో గజముఖుడు లేడు. గజ ముఖం ప్రస్తావన గణపతి అష్టోత్తరనామాలలో కనిపించదు. గజముఖుడైన వినాయకుని ఆవిర్భావం శివ పురాణాలలో ఉంది. పార్వతీమాత పిండిబొమ్మకు ప్రాణం పోయడం, శివుడు శిరస్సు ఖండించడం ఏనుగు తల అతికించడం, ప్రమథగణాలకు ఆధిపత్యం – అనే ఈ కథ భారతదేశం అంతటా బహుళ ప్రచారం పొందింది. తెలుగు కవి నన్నెచోడుడు కుమార సంభవం కావ్యంలో పార్వతీపరమేశ్వరుల లీలావినోదంగా గజరూపంలో క్రీడించగా గజముఖుడు జన్మించాడు అని చెప్పాడు. విఘ్నేశ్వరుడు ఆకాశం నుండి ఆవిర్భవించాడనేది వరాహపురాణ కథనం.

దేవకామినులను కూడా తన అందంతో భ్రమింపజేయడం వలన శివుడు, గణేశునికి ఏనుగు తలను కుండ లాంటి బొజ్జను కల్పించాడు అనేది మరొక కథ. కార్త్యవీర్యార్జునుని సంహరించిన అనంతరం పరశురామదేవుడు, పార్వతీపతి దర్శనార్ధం కైలాసం వచ్చాడు. పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆది దంపతులను దర్శించడం వీలుపడదని గణాధిపతి నిరోధించాడు. వారిరువురి మధ్య జరిగిన యుద్ధంలో వినాయకుని దంతం భగ్నమయింది. నాటి నుండి ఏకదంతుడనే నామం స్థిరపడింది అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది.

do you know that lord ganesha is bachelor but how he has two wives

మూషికాసుర సంహార సమయంలో తన దంతాన్నే ఆయుధంగా ఉపయోగించడంతో, ఏకదంతునిగా మిగిలాడని దేవీ భాగవతంలో ఉంది. ఏకదంతం ద్వంద్వాతీత స్థితిని తెలుపుతుందని వేదాంతుల భావన, ద్వాపరయుగం నాటికి విఘ్నేశ్వరుని ఆరాధన స్థిరపడింది. శ్రీకృష్ణుని దివ్య చరిత్ర‌లో శ్యమంతకమణి ఉపాఖ్యానం ఉంది. అవతార పురుషులు కూడా విఘ్ననాయకుని అర్చించవలసిందే.

గణపతి వ్యాస భగవానునికి రాయసకాడయ్యాడు. చేతిలో పక్షి ఈక రాత పరికరం. విదేశాలలో అటువంటి శిల్పాలున్నాయి, దీనినిబట్టి విఘ్ననాయకుడు విద్యాదాతగా ప్రసిద్ధుడు అయ్యాడు. వినాయకుడు బ్రహ్మచారి అయినప్పటికీ, సిద్ధి, బుద్ది – అనే భార్యలను కలిగి ఉన్నాడని చెప్తారు. అంటే, లోకకల్యాణ కారకాలయిన ఆ దివ్యశక్తులు వినాయకుని ఆధీనంలోనే ఉంటాయని చెప్పడం ఆంతర్యం అన్నమాట. అయితే ఆయ‌న కేవ‌లం కొన్ని శాస్త్రాల‌ను చ‌ద‌వ‌డం కోసం పెళ్లి అయి ఉండాలి క‌నుక‌నే పెళ్లి చేసుకున్నాడ‌ని, క‌నుక పెళ్లి అయినా కూడా ఆయ‌న బ్ర‌హ్మ‌చారే అని చెబుతారు.

Tags: Lord Ganesha
Previous Post

శాపం కార‌ణంగానే శ్రీకృష్ణుడు అవ‌తారం చాలించాడా..?

Next Post

కాంతార హీరో రిషబ్‌ శెట్టి ఫ్యామిలీ ఫోటోలు చూశారా?

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
మొక్క‌లు

Tella Gurivinda : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

by D
January 4, 2023

...

Read more
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

by Admin
August 7, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.