రాయలసీమ స్పెషల్ ఉగ్గాని.. చిటికెలోనే తయారు చేయవచ్చు..
బొరుగులు.. ఇవి మనందరికీ తెలుసు. బియ్యంతో చేసే ఈ బొరుగులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బొరుగులు చాలా త్వరగా జీర్ణమవుతాయి. బరువు తగ్గాలనుకునే వారు, జీర్ణశక్తి తక్కువగా ఉన్న వారు వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బొరుగులతో చేసే రుచికర వంటకాల్లో ఉగ్గాని కూడా ఒకటి. రాయలసీమ స్పెషల్ వంటకమైన ఈ ఉగ్గానిని రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం….