వినాయకుడి ఆలయంలో కానీ లేదంటే పూజ మందిరంలో కానీ వినాయకుడి దగ్గర చాలామంది గుంజీలు తీస్తూ ఉంటారు. అయితే ఎందుకు వినాయకుడు ముందు నిలబడి గుంజీలు తీయాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. శ్రీమహావిష్ణువు మేనల్లుడు అయిన గణపతికి బహుమతులని తీసుకొస్తూ ఉండేవారు. అయితే బహుమతులు చూపిస్తూ విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని వినాయకుడి పక్కన పెట్టగా.. వినాయకుడు ఆ సుదర్శన చక్రాన్ని తొండంతో తీసుకొని తినేస్తాడు.
సుదర్శన చక్రం ఏది అని అడిగితే మింగేసినట్లు చెప్తారు వినాయకుడు. అయితే మహావిష్ణువు దానిని ఎలా అయినా బయటకు తీసుకురావాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆఖరికి చెవులు పట్టుకుని గుంజీలు తీస్తూ ఉంటాడు విష్ణుమూర్తి. అప్పుడు ఆనందం వేసి పెద్దగా నవ్వుతాడు వినాయకుడు. నవ్వినప్పుడు సుదర్శన చక్రం వచ్చేస్తుంది వినాయకుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా గుంజీలు తీయడం మంచిదని అప్పటినుండి కూడా భక్తులు కోరికలు నెరవేరడానికి వినాయకుడి ముందు నించుని గుంజీలు తీస్తూ ఉంటారు.
అది ఆచారంగా మారిపోయింది ఎవరికైనా ఏదైనా కోరిక నెరవేరాలంటే వినాయకుడి దగ్గరికి వెళ్లి గుంజీలు తీస్తుంటారు. గుంజీలు తీయడం వలన నష్టం ఏమీ లేదు. అది మంచి వ్యాయామంగా కూడా పనిచేస్తుంది. అయితే అప్పటినుండే కూడా ఇలా వినాయకుడి ముందు నిలబడి గుంజీలు తీయడం జరుగుతుంది. చాలామంది వారి యొక్క కోరికలని తీర్చుకోవడానికి గుంజీలు తీస్తూ ఉంటారు. అందుకే వినాయకుడి ఆలయాల్లో మనకి చాలా మంది గుంజీలు తీయడం కనబడుతుంటుంది.