Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం

డెంగ్యూ వ‌చ్చిన వారిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటో తెలుసా ?

Admin by Admin
September 19, 2021
in ఆరోగ్యం, వైద్య విజ్ఞానం
Share on FacebookShare on Twitter

అస‌లే ఇది వ‌ర్షాకాలం. కాస్తంత ఆద‌మ‌రిచి ఉంటే చాలు, మ‌న‌పై దోమ‌లు దాడి చేస్తుంటాయి. చాలా వర‌కు వ్యాధులు దోమ‌ల వ‌ల్లే వ‌స్తుంటాయి. వాటిల్లో డెంగ్యూ ఒక‌టి. ఏడిస్ ఏజిప్టి అనే దోమ కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ వ‌స్తుంది.

డెంగ్యూ వ‌చ్చిన వారిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటో తెలుసా ?

దోమలు కుట్టిన వెంట‌నే డెంగ్యూ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వు. అందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. సాధార‌ణంగా డెంగ్యూ వ‌చ్చాక ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డేందుకు 4-10 రోజుల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటే ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది.

డెంగ్యూ వ‌చ్చిన వారిలో 106 డిగ్రీల ఫారెన్‌హీట్ జ్వ‌రం ఉంటుంది. స‌డెన్‌గా జ్వరం తీవ్ర‌త పెరుగుతుంది. తీవ్ర‌మైన త‌ల‌నొప్పి వ‌స్తుంది. లింఫ్ గ్రంథులు వాపుల‌కు గుర‌వుతాయి. తీవ్ర‌మైన కీళ్లు, కండ‌రాల నొప్పులు వ‌స్తాయి. చ‌ర్మంపై 2 నుంచి 5 రోజుల్లో ద‌ద్దుర్లు ఏర్ప‌డ‌తాయి.

డెంగ్యూ వ‌చ్చిన వారిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటో తెలుసా ?

ఇక డెంగ్యూ వ‌చ్చిన వారిలో కొంద‌రికి క‌డుపులో నొప్పి, వాంతులు అవ‌డం, ముక్కు లేదా చిగుళ్ల నుంచి ర‌క్త స్రావం అవ‌డం, వాంతుల్లో ర‌క్తం ప‌డ‌డం, మ‌లంలో ర‌క్తం ప‌డ‌డం, తీవ్ర‌మైన అల‌స‌ట వంటి ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తుంటాయి. క‌నుక ఈ ల‌క్ష‌ణాలు ఉంటే ఏమాత్రం ఆల‌స్యం చేయకుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకోవాలి.

డెంగ్యూ వ‌చ్చిన వారికి ప్ర‌త్యేకంగా మందులు అంటూ ఏమి ఉండ‌వు. ల‌క్ష‌ణాల‌కు అనుగుణంగా చికిత్స చేస్తారు. యాంటీ బ‌యోటిక్స్ ఇవ్వ‌డంతోపాటు జ్వ‌రం, ఒళ్లు నొప్పులు, ఇత‌ర ల‌క్ష‌ణాలు త‌గ్గేందుకు డాక్ట‌ర్లు మందుల‌ను ఇస్తారు. ఈ క్ర‌మంలో స‌రైన స‌మ‌యంలో చికిత్స తీసుకుంటే త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. లేదంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది.

డెంగ్యూ వ‌చ్చిన వారికి రోజూ ప్లేట్‌లెట్ల ప‌రీక్ష‌లు చేస్తారు. ప్లేట్ లెట్ల సంఖ్య వ‌రుస‌గా రెండు రోజులు పెరిగితే అప్పుడు వ్యాధి త‌గ్గుతున్న‌ట్లు లెక్క‌. దీంతో బాధితుల‌ను డిశ్చార్జి చేస్తారు. అయితే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరగాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. ఆకుకూర‌లు, కూర‌గాయ‌లు, పండ్లు, న‌ట్స్, విత్త‌నాల‌ను బాగా తినాలి. అలాగే రోజుకు రెండు సార్లు పావు టీస్పూన్ చొప్పున బొప్పాయి ఆకుల ర‌సం తాగాలి. కివీ పండ్ల‌ను తినాలి. ఇవి ప్లేట్‌లెట్ల‌ను బాగా పెంచుతాయి.

డెంగ్యూ వ‌చ్చిన వారిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటో తెలుసా ?

ఎవ‌రికైనా ఒక‌రికి ఇంట్లో డెంగ్యూ వ‌స్తే అంద‌రికీ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. అంటే ఇది అంటు వ్యాధి కాదు. కానీ ఒక‌రిని కుట్టిన దోమ‌లు, ఇంకొక‌రిని క‌చ్చితంగా కుట్టేందుకు అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక ఇంట్లో ఎవ‌రికైనా డెంగ్యూ వ‌స్తే వెంట‌నే ఇత‌రుల‌కు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ముఖ్యంగా దోమ‌లను త‌రిమేయాలి. ఇంటి చుట్టు, ప‌రిస‌రాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఎల్ల‌ప్పుడూ ప‌రిశుభ్ర‌మైన ఆహారం, నీరు తాగాలి. నీటిని మ‌రిగించి తాగితే ఇంకా మంచిది. అలాగే ఆహారాల‌ను తినడానికి ముందు చేతుల‌ను ప‌రిశుభ్రంగా క‌డుక్కోవాలి. ఈ విధ‌మైన జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే డెంగ్యూ రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

Tags: dengueడెంగ్యూ
Previous Post

షుగ‌ర్ లెవ‌ల్స్ అధికంగా ఉన్న‌వారు.. తేనె, ఉసిరికాయ ర‌సం తాగాల్సిందే..!

Next Post

సాబుదానా (స‌గ్గు బియ్యం) చేసే మేలు అంతా ఇంతా కాదు.. వీటిని తీసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

Related Posts

వైద్య విజ్ఞానం

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

నీళ్ల‌ను త‌గిన మోతాదులో తాగ‌క‌పోతే జ‌రిగే అన‌ర్థాలు ఇవే..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

రోజూ స‌రిగ్గా నిద్ర పోవ‌డం లేదా..? అయితే ఏం జ‌రుగుతుందంటే..?

July 20, 2025
వైద్య విజ్ఞానం

ఐస్ లేదా హీట్ ప్యాక్‌ల‌ను ఏయే నొప్పుల‌కు పెట్టాలో తెలుసా..?

July 19, 2025
వైద్య విజ్ఞానం

పొగ తాగడం వ‌ల్ల గుండెకు ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుందో తెలుసా..?

July 19, 2025
వైద్య విజ్ఞానం

గొంతులో తెమ‌‌‍‌డ ఏర్పడటం ఏమిటి? నివారణ ఏమైనా ఉందా?

July 19, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.