Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

సైన‌స్, జ‌లుబు ఇబ్బంది పెడుతున్నాయా ? అయితే ఈ 5 యోగాస‌నాలు వేయండి..!

Admin by Admin
July 21, 2021
in యోగా
0
Share on FacebookShare on Twitter

చ‌లికాలంతోపాటు వ‌ర్షాకాలంలోనూ సైన‌స్ స‌మ‌స్య ఇబ్బందులు పెడుతుంటుంది. దీనికి తోడు జ‌లుబు కూడా వ‌స్తుంటుంది. ఈ రెండు స‌మ‌స్య‌లు ఉంటే ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. అనేక అవ‌స్థలు ప‌డాల్సి వ‌స్తుంది. అయితే యోగాలో ఉన్న ఈ 5 ఆస‌నాల‌ను వేయ‌డం వ‌ల్ల ఆ రెండు స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆస‌నాలు ఏమిటంటే..

1. పాద‌హ‌స్తాస‌నం

do these 5 yoga asanas every day to get relief from sinus and cold

You might also like

ధ్యానం వల్ల కలిగే 7 అద్భుత‌మైన‌ ప్రయోజనాలు

June 25, 2025

ఎన్నో రోగాల‌కు చెక్ పెట్టే…3 శ్వాస వ్యాయామాలు..

June 20, 2025

నిటారుగా నిల‌బ‌డి కింద‌కు వంగి చేతుల‌తో పాదాల‌ను తాకాలి. ఆరంభంలో క‌ష్టంగా ఉంటే మోకాళ్ల‌ను కొద్దిగా వంచ‌వ‌చ్చు. ఇలా 30 సెక‌న్ల పాటు ఉండాలి. మ‌ళ్లీ లేచి నిల‌బ‌డాలి. ఈ విధంగా 3 సార్లు చేయాలి.

2. వ‌జ్రాస‌నం

నేల‌పై నిటారుగా కూర్చుని మోకాళ్ల‌ను వంచి వెన‌క్కి తేవాలి. వెన్నెముక‌ను నిటారుగా ఉంచాలి. అర‌చేతుల‌ను మోకాళ్ల‌పై ఉంచాలి. ఈ భంగిమ‌లో 30 సెక‌న్ల పాటు ఉండాలి. ఇలా 3 సార్లు చేయాలి.

3. సుప్త వ‌జ్రాస‌నం

ఇది వ‌జ్రాస‌నంలో ఒక భాగ‌మే కాక‌పోతే నిటారుగా ఉన్న‌వారు అలాగే వెన‌క్కి వెల్లకిలా ప‌డుకోవాలి. అర‌చేతుల‌ను మోకాళ్ల మీద నుంచి తీసి పాదాల ప‌క్కన పెట్టాలి. ఇలా కూడా 30 సెక‌న్ల పాటు ఉండాలి. దీన్ని కూడా 3 సార్లు చేయాలి.

4. స‌ర్వాంగాస‌నం

దీన్ని ఆరంభంలో కొంద‌రు చేసేందుకు క‌ష్ట‌మ‌వుతుంది. కానీ సాధ‌న చేస్తే దీన్ని వేయ‌డం సుల‌భ‌మే. ఈ ఆస‌నంలో త‌ల‌ను కింద‌కు కాళ్ల‌ను పైకి పెట్టాలి. న‌డుముకు అర‌చేతుల‌ను పెట్టి స‌పోర్ట్‌ను ఇవ్వాలి. ఇలా 30 సెక‌న్ల పాటు ఉండేందుకు ప్ర‌య‌త్నించాలి. 3 సార్లు చేయాలి.

5. స‌విత్రి ఆస‌నం

మోకాళ్ల మీద కూర్చుని వెన్నెముక‌ను నిటారుగా ఉంచి త‌ల‌ను కొద్దిగా పైకెత్తాలి. చేతుల‌ను పైకి లేపి నిటారుగా ఉంచాలి. ఇలా 30 సెక‌న్ల పాటు ఉండాలి. 3 సార్లు చేయాలి.

ఈ ఆస‌నాల‌ను రోజూ వేయ‌డం వ‌ల్ల సైన‌స్, జ‌లుబు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

Tags: asanascoldsinussinusitisyogaఆస‌నాలుజ‌లుబుయోగాసైన‌స్‌సైనుసైటిస్‌
Admin

Admin

Related Stories

ధ్యానం వల్ల కలిగే 7 అద్భుత‌మైన‌ ప్రయోజనాలు

by Admin
June 25, 2025
0

ధ్యానం అనేది మనస్సుకు ఒక మంచి వ్యాయామం, దీనిలో మనం ఆధ్యాత్మిక స్వయం లేదా ఆత్మతో అనుసంధానం అయ్యి ఆత్మ యొక్క సుగుణాలను అనుభూతి చేసుకుంటాము. అలాగే,...

ఎన్నో రోగాల‌కు చెక్ పెట్టే…3 శ్వాస వ్యాయామాలు..

by Admin
June 20, 2025
0

మ‌న శ‌రీరంలో నిర్దిష్ట‌మైన అవ‌యవాలు క‌లిసి ఒకే ప్రాంతంలో ఉంటాయి క‌దా. ఉదాహ‌ర‌ణ‌కు ఊపిరితిత్తులు, గుండె, కాలేయం వంటివి ఉరః పంజ‌రంలో ఎముకల కింద ఉంటాయి. అదే...

ఆఫీసులో కుదిరితే ఈ చిన్న‌పాటి యోగాస‌నాలు వేయండి.. ఎంతో ఫ‌లితం ఉంటుంది..

by Admin
June 17, 2025
0

ఆఫీసులో యోగానా? అని ఆశ్చర్యపోకండి. యోగా అంటే సూర్యనమస్కారాలు వంటివే కాదు. ఎక్కడ వున్నప్పటికి సౌకర్యంగా కొన్ని యోగా భంగిమలు ఆచరించవచ్చు. ఆఫీసుల్లో ఎంతో ఒత్తిడి. ఈ...

హైబీపీ ఉన్న‌వారు ఈ ఆస‌నాల‌ను వేస్తే ఎంతో ఫ‌లితం ఉంటుంది..!

by Admin
June 16, 2025
0

బీపీ ప్రస్తుతం కాలంలో సాధారణమైన సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లలు సైతం బీపీతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి, ఆహారం. రక్తపోటును నియంత్రించాలన్నా సరే...

Next Post

టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ? షుగ‌ర్ లెవ‌ల్స్ ఎంత ఉండాలో చూడండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.