కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శానిటైజర్లను వాడడంతోపాటు బయటకు వెళ్లినప్పుడు మాస్కులను ధరిస్తున్నారు. దీంతోపాటు కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం భౌతిక దూరం పాటిస్తున్నారు. అయితే శానిటైజర్ల విషయానికి వస్తే కృత్రిమంగా తయారు చేయబడిన కెమికల్ శానిటైజర్‌కు బదులుగా మీరే మీ ఇంట్లోనే సహజసిద్ధంగా శానిటైజర్‌ను తయారు చేసుకోవచ్చు. యోగా గురువు బాబా రాందేవ్ శానిటైజర్‌ను ఎలా తయారు చేసుకోవాలో చెప్పారు. ఆ వివరాలు మీ కోసం..

సహజసిద్ధమైన శానిటైజర్ తయారీకి కావల్సిన పదార్థాలు
- నీరు – 1 లీటర్
- వేప ఆకులు – 100 గ్రాములు
- తులసి ఆకులు – 20 గ్రాములు
- ఆలం (పటిక) – 10 గ్రాములు
- కర్పూరం – 10 గ్రాములు
- కలబంద గుజ్జు – తగినంత
సహజసిద్ధమైన శానిటైజర్ తయారీ విధానం
1 లీటర్ నీటిలో వేపాకులు, తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి. అందులో కలబంద గుజ్జును వేయాలి. 1 లీటర్ నీరు 700 ఎంఎల్ అయ్యే వరకు మరిగించాలి. తరువాత అందులో కర్పూరం, పటిక వేయాలి. దీంతో అవి కరుగుతాయి. శానిటైజర్ తయారవుతుంది. దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ సహజసిద్ధమైన శానిటైజర్ మార్కెట్‌లో దొరికే శానిటైజర్‌లాగే పనిచేస్తుందని బాబా రాందేవ్ తెలిపారు. దీనిపై తాము సైంటిఫిక్ రీసెర్చ్ చేశామని, అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, అందువల్ల దీన్ని ఎవరైనా ఉపయోగించవచ్చని తెలిపారు.
घरेलू हैंड सैनिटाइजर कैसे बनाएं? स्वामी रामदेव @yogrishiramdev से जानें#CoronaVirusUpdates
Anchor: @journosaurav
IndiaTV LIVE at: https://t.co/ito3TSmlBq pic.twitter.com/Ot9y31okVs
— India TV Hindi (@IndiaTVHindi) March 14, 2020











