మీకు హైబీపీ ఉందా ? అది అదుపులో ఉందో లేదో చెక్ చేసుకోండి.. లేదంటే కోవిడ్ ముప్పు ఎక్కువవుతుంది..!
హైపర్‌టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్.. ఇదొక తీవ్రమైన అనారోగ్య స్థితి. ప్రపంచవ్యాప్తంగా ఏటా అనేక మంది హైబీపీ కారణంగా చనిపోతున్నారు. కరోనా వైరస్ ప్రభావం మొదలై దాదాపుగా ఏడాదిన్నర దాటింది. ఈ క్రమంలోనే హైబీపీ సమస్య ఉన్నవారు కోవిడ్ కారణంగా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. మన దేశంలో దాదాపుగా 30 శాతం మంది హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా గణనీయంగా పెరిగిపోతోంది….