వాకింగ్ ఇలా చేస్తే.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..!
శరీరంలోని ఇతర కండరాలవలే, గుండె కూడా ఒక కండరమే. గుండె శరీరమంతా రక్తప్రసరణ చేస్తుంది. దానికి ప్రతిరోజూ తగిన వ్యాయామం కావాలి. వ్యాయామం చేయకపోతే శరీరం అనారోగ్యాలకు గురవుతుంది. చేసే వ్యాయామాలు మొదలు పెట్టేటపుడు తక్కువ సమయంలోను, క్రమేణా అధిక సమయానికి మార్చాలి. వ్యాయామం రక్తప్రసరణ అధికం చేసి గుండె బాగా పని చేయటానికి తోడ్పడుతుంది. వ్యాయామం అంటే అలసిపోయేట్లు పరుగులు పెట్టటం మాత్రమే కాదు. లేదా ఖరీదైన వ్యాయామ పరికరాలు కొని ఉపయోగించటమే కాదు. శరీరాన్ని…