Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వ్యాధులు పైల్స్

పైల్స్ స‌మ‌స్య కార‌ణాలు, ల‌క్ష‌ణాలు.. ఆయుర్వేద చిట్కాలు..!

Admin by Admin
July 15, 2021
in పైల్స్
Share on FacebookShare on Twitter

అర్శమొలలు.. మొలలు.. హెమరాయిడ్స్.. పైల్స్‌.. ఇలా ఈ వ్యాధికి అనేక పేర్లు ఉన్నాయి. చాలా మంది దీన్ని పైల్స్‌ అనే పిలుస్తారు. పైల్స్‌ సమస్య ఉన్న వారి బాధ నిజంగా వర్ణనాతీతం. మలద్వారంలో మొలల్లా పొడుచుకు రావడం వల్ల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, మంట కలుగుతాయి. ఆ భాగంలో సూదులు గుచ్చుకుంటున్నంత బాధ ఉంటుంది. వీరు ఒక చోట కూర్చోలేరు. నిలుచోలేరు. ఒక దశలో మొలలు చిట్లడం వల్ల రక్తస్రావం కూడా వుతుంది. ఈ రక్తస్రావం ఎక్కువ కాలం కొనసాగితే రక్తహీనత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. పెద్ద పేగుల చివరి భాగాన్ని మలనాళం లేదా రెక్టమ్‌ అంటారు. ఇక్కడ అధికంగా ఉండే రక్త నాళాల్లో వాపు ఏర్పడడం వల్ల ఈ స్థితి వస్తుంది. మొలలు పురీషనాళం వెలుపలి భాగంలో వస్తే ఎక్స్‌టర్నల్‌ హెమరాయిడ్స్‌ అని, లోపలి భాగంలో వస్తే ఇంటర్నల్‌ హెమరాయిడ్స్‌ అని అంటారు. ఈ స్థితిని మూలశంక అని కూడా పిలుస్తారు.

piles causes symptoms and ayurvedic remedies

పైల్స్‌ రావడానికి గల ప్రధాన కారణం మలబద్దకం. విసర్జన సమయంలో ముక్కడం వల్ల మలద్వారంలోని కణజాలం వాపునకు గురవుతుంది. కొందరిలో దీర్ఘకాలిక విరేచనాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ప్రసవ సమయంలో గర్భస్థ శిశువు ఒత్తిడి మలద్వారం మీద అధికం కావడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. పురుషుల్లో ప్రోస్టేట్‌ గ్రంథిలో వాపు ఏర్పడడం వల్ల, మలనాళం లేదా పురీష నాళం మీద ఒత్తిడి పెరగడం వల్ల పైల్స్‌ సమస్య రావచ్చు. పొత్తి కడుపు లేదా పేగుల్లో క్యాన్సర్‌ సంబంధిత కణతులు ఏర్పడడం వల్ల కూడా పైల్స్‌ రావచ్చు. కొందరిలో వంశానుగతంగానే వారి కుటుంబ వ్యక్తులకు మలనాళం దగ్గర సిరలు బలహీనంగా ఉంఆయి. ఇది కూడా పైల్స్‌కు దారి తీయవచ్చు. అధిక బరువు, స్థూలకాయం కూడా ఒక దశలో పైల్స్‌కు మూలం కావచ్చు. వీటితోపాటు పీచు పదార్థః లేని ఆహారం తీసుకోవడం వల్ల కూడా పైల్స్‌ సమస్య రావచ్చు.

మొదటి దశలో మొలలు, మలనాళంలో ఉంటూ బయటకు కనిపించవు. రెండో దశలో హెమరాయిడ్లు మలనాళం గోడల వెలుపలికి చొచ్చుకుని వస్తాయి. అయితే పురీష ద్వారం తెరుచుకుని ఉన్నప్పుడు వెలుపలికి వచ్చి మలద్వారం మూసుకోగానే లోపలికి వెళ్లిపోతాయి. మూడవ దశలో హెమరాయిడ్స్‌ వెలుపలికి వచ్చినా చేతితో నెట్టినప్పుడ లోపలికి వెళ్లిపోతాయి. నాలుగవ దశలో ఏ రకంగానూ లోపలికి వెళ్లకుండా వెలుపలే వేళ్లాడుతూ ఉండిపోతాయి.

హెమరాయిడ్స్‌ లోపలి భాగంలోనే ఉన్నప్పుడు ఏ లక్షణాలూ కనిపించవు. మలద్వారం తెరుచుకున్నప్పుడు మూత్రం మలద్వారం ద్వారా రక్తం వస్తుంది. మలద్వారం చుట్టూ దురద కూడా రావచ్చు. హెమరాయిడ్స్‌ మూడు, నాలుగో దశకు చేరుకున్నప్పుడు తీవ్రమైన నొప్పితోపాటు చీము కూడా వస్తుంది.

ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా.. అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉండే పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, తృణ ధాన్యాలతోపాటు నీరు ఎక్కువగా తాగడం వల్ల హెమరాయిడ్స్‌ సమస్యను చాలా వరకు నివారించవచ్చు.

మాంసాహారం, పచ్చళ్లు, మసాలా పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. తరచూ సుఖ విరేచనాన్ని కలిగించే మందులను డాక్టర్ల సలహాలతో పాటించడం మేలు.

1. హెమరాయిడ్స్ కు దానిమ్మ పండ్ల తొక్క బాగా పనిచేస్తుంది. ఆ తొక్కలను నీటిలో వేసి బాగా ఉడికించి అనంతరం ఆ నీటిని వడకట్టి రోజుకు రెండు సార్లు తాగుతుండాలి. దీంతో పైల్స్‌ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

2. ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్‌ మోతాదు చొప్పున అల్లం, నిమ్మరసం కలిపి తాగుతుండాలి. పైల్స్‌ తగ్గుతాయి.

3. పైల్స్ కు ముల్లంగి రసం కూడా అద్భుతంగానే పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే అర కప్పు మోతాదులో ముల్లంగి రసాన్ని తాగుతుంటే పైల్స్‌ తగ్గుతాయి.

4. పైల్స్, మలంలో రక్తం పడడం వంటి సమస్యలను నివారించడానికి పచ్చి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను తినడం లేదా జ్యూస్‌ను అరకప్పు మోతాదులో రోజూ తాగడం వల్ల రక్తం పడడం తగ్గుతుంది. నొప్పులు తగ్గిపోతాయి.

5. అంజీర్‌ పండ్ల (డ్రై ఫ్రూట్స్‌లా ఉండేవి)ను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపున ఆ పండ్లను తినాలి. దీంతో పైల్స్‌ తగ్గుతాయి.

6. రోజూ రాత్రి ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో లేదా పాలలో కొద్దిగా పసుపును కలుపుకుని తాగితే పైల్స్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది.

7. రోజూ అరటి పండ్లను రెండు పూటలా ఒకటి చొప్పున తింటుండాలి. పైల్స్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది.

8. పైల్స్‌ సమస్య ఉన్న వారు ఫైబర్‌ ఎక్కువగా ఉండే సోయా బీన్స్, రాజ్మా, చిక్కుళ్లు, అలచందలు, గోరు చిక్కుడు, పచ్చి బఠానీలు, పాలకూర వంటి ఆహారాలను రోజూ తీసుకోవాలి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: pilesపైల్స్‌
Previous Post

ప్రీ డ‌యాబెటిస్ అంటే ఏమిటి ? అంద‌రూ తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యం..!

Next Post

ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తారు ? రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తే మంచిది ?

Related Posts

No Content Available

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
పోష‌కాహారం

పోషకాల గ‌ని న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు.. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

by Admin
July 6, 2021

...

Read more
home gardening

Betel Leaves Plant : త‌మ‌ల‌పాకు మొక్క‌కు వీటిని వేయండి.. ఆకులు బాగా వ‌చ్చి మొక్క ఏపుగా పెరుగుతుంది..!

by Editor
July 12, 2023

...

Read more
food

Sweet Chutney : ఇడ్లీ, దోశ‌ల‌లోకి తియ్య‌ని చ‌ట్నీని ఇలా చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

by D
June 25, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
jobs education

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..!

by Peddinti Sravya
October 21, 2024

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.