రష్యన్ S400 – 40KM నుంచీ 400KM పరిధి లో రక్షణ కోసం, ఇజ్రాయేల్ వారి barrack 8 – 70km to 100 KM, ఆకాష్ ( అలాగే NG ) – 4.5KM to 80KM. ఇప్పుడు వీటికి అదనంగా Quick reaction surface to air missile వ్యవస్థ 30,000 కోట్ల రూపాయలతో 3 రెజిమెంట్ లు కలపనున్నారు. మూడు రెజిమెంట్లు కలిపి 36 లాంచర్లు, 216 క్షిపణులు ఒకే సారి ప్రయోగించగలవు. వీటిని high risk area లలో శత్రువులకు దగ్గరగా సరిహద్దులలో మోహరిస్తారు. వీటి ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
మన సైన్యం అధికమొత్తంలో యుద్ద ట్యాంకులు, armored vehicles, మరేదైనా high value convoy వెళుతున్నా, లేదా శత్రువు భూభాగంలోకి వెళ్తున్నా మనతోపాటు వీటిని తీసుకుని వెళ్ళవచ్చు. ఇది ప్రయాణంలో ఉండగా కూడా ( on the move ) డ్రోన్లు, క్షిపణులు, attack హెలికాప్టర్ లు, యుద్ద విమానాల నుంచి రక్షిస్తూ ముందుకి వెళ్ళగలదు.
ఆకాష్ ఐతే ఒక చోటి నుంచే మరొక చోటికి తరలించాడానికి వీలు ఉన్నప్పటికీ తరలించిన తరువాత దాన్ని install చేసిన తరువాత రక్షించడం మొదలు పెడుతుంది. కాబట్టి ఎయిర్ బేస్ లు, రాడార్ లు, మిలిటరీ installations దగ్గర ఆకాష్ ని ఉపయోగించి QRSAM ని మాత్రం యుద్ధంలో తమతోపాటు తిరుగుతూ రక్షించడానికి వాడుకుంటారు. ఒక రెజిమెంట్ ఇంచు మించు 180KM పరిధిలో ప్రమాదాలను పసిగడుతూ, రక్షణ వలయం సృష్టించగలదు. ఈ క్షిపణుల రియాక్షన్ time, వేగం, ఆకాష్ కన్నా చాలా ఎక్కువ. ఆకాష్ కన్నా ధర కూడా ఎక్కువే! ఒక రెజిమెంట్ లో క్రింది components ఉంటాయి.
ఒక రెజిమెంట్ కమాండ్ పోస్ట్ వెహికల్ ఉంటుంది. అది శాటిలైట్ on the move తో 3 missile batteries ని అనుసంధానం చేసి ఉంచుతుంది. సెంట్రల్ command లా పనిచేస్తుంది. ఇందులో ఉన్న ఒక్కో మిస్సైల్ బ్యాటరీ కి ఒక బ్యాటరీ కమాండ్ పోస్ట్ వెహికల్, ఒక బ్యాటరీ సర్విలెన్స్ వెహికల్ , 4 combat groups, కలిపి radio on the move ద్వారా అనుసంధానం అవుతాయి. ఒక్కొ combat group కి, battery multi function radar, ఒక missile launch vehicle 6 క్షిపణులు ఉంటాయి ఒక దానిలో. పాత కాలం వ్యవస్థల మాదిరి, వీటన్నింటినీ ఒక రాడార్ నడిపిస్తే, ఆ రాడార్ ని ధ్వంసం చేసినా జామ్ చేసినా మొత్తం వ్యవస్థ ఇబ్బంది పడేది. ఇందులో అలా కాకుండా, సెంట్రల్ radar తోపాటు వివిధ రాడార్లు ఉంటూ ప్రతి launcher కీ ప్రత్యేకం గా ఒక రాడార్ కలిగివుండటం వల్ల సేతువులు SEAD ( suppression of enemy air defense ) లాంటి వ్యూహాలు పన్నినప్పుడు, సమర్ధవంతంగా ఎదుర్కోగలదు.