దాదాపు ఏ సినిమాలో అయినా హీరో పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. హీరోయిన్ కంటే హీరోనే ఎక్కువగా చూస్తారు. సినిమా వాల్ పోస్టర్ మీద హీరోయే క్రౌడ్ పుల్లర్. మనం ఏదైనా ఒక సినిమా చూసేటప్పుడు ఆ సినిమాలో హీరోలు, హీరోయిన్లు చనిపోయినప్పుడు మనం బాధపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొన్ని సినిమాలలో హీరో మరణించడంతో అభిమానులు నిరాశగా బయటకి వస్తూ ఉంటారు. ఇలా హీరో చనిపోయినప్పటికీ సినిమా హిట్ అయిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జెర్సీ.. చాలా రోజులకు నానికి మంచి హిట్ ఇచ్చిన సినిమా ఇది. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో 2019లో తెరకెక్కిన ఈ చిత్రంలో క్లైమాక్స్ లో క్రికెట్ మ్యాచ్ అనంతరం హీరో కుప్పకూలిపోతాడు.
భీమిలి కబడ్డీ జట్టు.. ఈ సినిమాలో కూడా హీరో పాత్ర మరణిస్తుంది. తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కబడ్డీ ఆటలో క్లైమాక్స్ లో హీరో మరణిస్తాడు. నేనే రాజు నేనే మంత్రి.. ఈ చిత్రంలో హీరో పాత్ర, హీరోయిన్ పాత్ర రెండు చనిపోతాయి. తేజ దర్శకత్వంలో 2017 లో వచ్చిన ఈ చిత్రంలో రానా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో జోగేంద్ర తనకు తానుగా ఉరివేసుకొని మరణిస్తాడు. అడివి శేష్ ఎంతో సీరియస్ గా తీసుకొని తెరకెక్కించిన మేజర్ సినిమాలో కూడా హీరో పాత్ర చనిపోతాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో టెర్రరిస్టుల ఎటాక్ లో సందీప్ మరణిస్తాడు.
బాహుబలి.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2017వ సంవత్సరంలో తెరకెక్కిన బాహుబలి చిత్రంలో కట్టప్ప, బాహుబలిని వెన్నుపోటు పొడుస్తాడు. రెండు భాగాలుగా తెరకెక్కిన బాహుబలి సినిమాలోని మొదటి భాగంలో హీరో చనిపోతాడు.