Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు అందానికి చిట్కాలు

మీ గోర్లు ప‌సుపు రంగులోకి మారిపోయాయా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Admin by Admin
September 25, 2024
in అందానికి చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలా మంది గోర్ల‌ను ఆక‌ర్ష‌ణీయ‌త కోసం పెంచుకుంటారు. కొంద‌రైతే గోర్లు పెరుగుతున్నా వాటిని ప‌ట్టించుకోరు. కానీ వాటిని శుభ్రంగా ఉంచుకోక‌పోతే మ‌న‌కు వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. గోర్ల‌ను పెంచుకున్నా, పెంచుకోక‌పోయినా వాటిని ఎప్ప‌టి క‌ప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఈ క్ర‌మంలో అలా శుభ్రం చేసుకోక‌పోయినా, లేదంటే ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్‌, విట‌మిన్ లోపం, పొగ తాగ‌డం, డ‌యాబెటిస్‌, లివ‌ర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఉన్న వారి గోర్లు ప‌సుపు రంగులోకి మారిపోతాయి. ఒక వేళ మీకు గ‌న‌క అలా మారి ఉంటే వెంట‌నే స్పందించండి. అలాంటి వారు కింది టిప్స్‌ను పాటిస్తే గోర్ల‌ను ప‌సుపు రంగు నుంచి సాధార‌ణ స్థితికి మార్చుకోవ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గోర్ల‌కు ఎవ‌రైనా నెయిల్ పెయింట్ వేసుకున్న‌ట్టయితే వెంట‌నే దాన్ని తీసేయాలి. గోర్లకు ఎలాంటి ప‌దార్థాలు లేన‌ప్పుడే వాటి అస‌లు రంగు తెలుస్తుంది. దీంతో ఆ రంగును తొల‌గించుకునేందుకు వీలుంటుంది. కాబ‌ట్టి నెయిల్ పాలిష్ రిమూవ‌ర్‌తో పెయింట్‌ను తీసేయండి. అనంత‌రం కింది టిప్స్‌ను పాటించండి.

how to get rid of yellow color nails problem

చిన్న గిన్నెలో కొద్దిగా నిమ్మ‌ర‌సం తీసుకుని అందులో గోళ్ల‌ను పూర్తిగా ముంచాలి. అలా 10 నుంచి 15 నిమిషాల పాటు ఉండాలి. అనంత‌రం గోర్ల‌ను బ‌య‌ట‌కు తీయాలి. ఇప్పుడు ఒక టూత్‌బ్ర‌ష్ స‌హాయంతో అదే నిమ్మ‌రసాన్ని ఉప‌యోగించి గోర్ల‌ను శుభ్రంగా రుద్దాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో గోర్ల‌ను క‌డిగేయాలి. త‌రువాత గోర్ల‌కు మాయిశ్చ‌రైజ‌ర్‌ను అప్లై చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు నిత్యం చేస్తూ ఉంటే ప‌సుపు రంగు గోర్లు సాధార‌ణ స్థితికి వ‌స్తాయి. అయితే నిమ్మ‌ర‌సం లేకుంటే లెమ‌న్ ఎసెన్షియ‌ల్ ఆయిల్‌ను కూడా నీటిలో క‌లుపుకుని పైన చెప్పిన విధంగా వాడుకోవ‌చ్చు. లేదంటే ఒక నిమ్మ‌కాయ‌ను తీసుకుని రెండు ముక్క‌లుగా క‌ట్ చేసి ఒక్కో ముక్క‌ను 10 నిమిషాల పాటు గోర్ల‌పై రాయాలి. అనంత‌రం క‌డిగేయాలి. ఇలా చేసినా గోర్లు సాధార‌ణ స్థితికి వ‌చ్చేస్తాయి.

టూత్‌పేస్ట్‌ను కొద్దిగా తీసుకుని గోర్ల‌కు బాగా రాయాలి. అనంత‌రం ఆ గోర్ల‌ను టూత్ బ్ర‌ష్ సహాయంతో రుద్దాలి. ఇలా ఒక్కో గోరును చేయాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. త‌రువాత మాయిశ్చ‌రైజ‌ర్ రాయాలి. ఇలా చేసినా గోర్ల సాధార‌ణ రంగును తిరిగి పొంద‌వ‌చ్చు. 3 టేబుల్ స్పూన్ల హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌ను తీసుకుని కొద్దిగా గోరు వెచ్చ‌ని నీటిలో క‌ల‌పాలి. అనంత‌రం ఆ నీటిలో గోర్ల‌ను ముంచి 10 నిమిషాల పాటు ఉండాలి. గోర్ల‌ను తీసి అదే మిశ్ర‌మంతో టూత్‌బ్ర‌ష్‌ను ఉప‌యోగించి గోర్ల‌ను రుద్దాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో గోర్ల‌ను క‌డిగి మాయిశ్చ‌రైజ‌ర్ రాయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా ఫ‌లితం ఉంటుంది.

1 టేబుల్ స్పూన్ హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌, రెండున్న‌ర టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మ‌ర‌సం తీసుకుని అన్నింటినీ బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని టూత్‌బ్ర‌ష్ స‌హాయంతో గోర్ల‌కు ప‌ట్టించాలి. 2 – 3 నిమిషాల పాటు గోర్ల‌ను అలాగే ఉంచి గోరు వెచ్చని నీటితో క‌డిగేయాలి. త‌రువాత మాయిశ్చ‌రైజ‌ర్‌ను అప్లై చేయాలి. ఇలా 6 నుంచి 8 వారాల పాటు చేస్తే ఫ‌లితం క‌నిపిస్తుంది. ముందు చెప్పిన దాంట్లో హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌కు బ‌దులుగా ఆలివ్ ఆయిల్‌ను కూడా వాడ‌వ‌చ్చు.

ఒక క‌ప్పు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ క‌లిపి ఆ మిశ్ర‌మంలో గోర్ల‌ను 20 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. అనంత‌రం గోర్ల‌కు ఆలివ్ ఆయిల్ రాసుకోవాలి. నిత్యం 3 సార్ల చొప్పున 4 వారాల పాటు ఇలా చేస్తే గోర్ల‌కు పూర్వ రంగు వ‌స్తుంది. నారింజ పండు తొక్క‌ల‌ను సేక‌రించి వాటిని ఎండ‌బెట్టి పొడి చేయాలి. ఈ పొడిని కొంత నీటికి క‌లిపి మెత్త‌ని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను టూత్ బ్ర‌ష్ స‌హాయంతో గోర్ల‌కు రాయాలి. అలా గోర్ల‌ను 10 నిమిషాల పాటు ఉంచాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. ఈ చిట్కాను 1 నుంచి 2 వారాల పాటు రోజూ పాటిస్తే గోర్ల‌కు ఉన్న ప‌సుపు రంగు పోతుంది. ముందు చెప్పిన దానికి బ‌దులుగా నారింజ పండు తొక్క‌ను రోజుకు 2 నుంచి 3 సార్లు గోర్ల‌కు రాస్తూ ఉన్నా గోర్ల రంగు సాధార‌ణ స్థితికి వ‌చ్చేస్తుంది.

Tags: yellow nails
Previous Post

భోజనం తర్వాత ఇలా చేయకండి..!

Next Post

మ‌హిళ‌లు పీరియ‌డ్స్ వ‌చ్చాక ఎన్ని రోజుల‌కు శృంగారంలో పాల్గొంటే గ‌ర్భం దాల్చే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంది..?

Related Posts

హెల్త్ టిప్స్

అంద‌మైన వ‌క్ష సంప‌ద కావాలంటే.. అమ్మాయిలు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

July 23, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశులు ఉన్న‌వారు రెండు స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటార‌ట‌..!

July 23, 2025
వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.