Rashmika Mandanna : రష్మిక మందన్న ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవుతారు..!

Rashmika Mandanna : తెలుగు ప్రేక్షకులకు రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఛలో అనే సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ తరువాత పలు హిట్‌ చిత్రాల్లో నటించి అలరించింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప వంటి సినిమాలతో ఈమె పాపులర్‌ అయింది. ఈ క్రమంలోనే నేషనల్‌ క్రష్‌గా కూడా మారింది. ప్రస్తుతం ఈమెకు బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక రష్మిక మందన్న కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా.. పలు బ్రాండ్లను ప్రమోట్‌ చేయడం ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది.

రష్మిక మందన్న వద్ద విలాసవంతమైన కార్లు, దుస్తులు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, బిల్డింగ్‌లు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం ఒక్క సినిమాకు రూ.4 కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈమె ఆస్తులు రూ.80 కోట్ల వరకు ఉంటాయని సమాచారం. వాటిల్లో చాలా వరకు ఖరీదైన కార్లు, ఇళ్లే ఉన్నాయి. ఈమెకు బెంగళూరులో రూ.8 కోట్లు విలువ చేసే ఇల్లు ఒకటి ఉంది. అలాగే ముంబైలోనూ అత్యంత ఖరీదైన ఏరియాలో ఆ మధ్యే ఒక ఇంటిని కొనుగోలు చేసింది.

rashmika mandanna net worth and properties value

ఇక రష్మిక మందన్న వద్ద కార్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాటిల్లో రూ.50 లక్షలు విలువ చేసే మెర్సిడెస్‌ బెంజ్‌ సి క్లాస్‌ కార్‌, రూ.40 లక్షలు విలువ చేసే ఆడి క్యూ3 కారు, టయోటా ఇన్నోవా, హుండాయ్‌ క్రెటా కార్లు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.