Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

బ్రిటిష్ అధికారి నిర్మించిన శివాల‌యం ఇది.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

Admin by Admin
March 24, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మతం, ప్రాంతం అన్నీ మనం ఏర్పర్చుకున్నవే. ఒకప్పుడు భూమి మీద ఉన్న ఏడు ఖండాలు కలిసి ఉండేవనేది సత్యం. అలాగే భగవంతునికి ఇలాంటి పరిమితులు ఉండవు కదా! ఈ ప్రపంచంలో ఉన్న రూపాలన్నీ ఆయనవే! ఈ లోకంలోని మనుషులంతా ఆయన భక్తులే! అందుకు ఉదాహరణగా నిలుస్తున్న ఒక జరిగిన గాథ గురించి తెలుసుకుందాం…. 1879 సంవత్సరంలో..బ్రిటీష్‌వారు మన దేశాన్ని పాలిస్తున్న రోజులు. వారి సైన్యంలో కల్నల్‌ మార్టిన్‌ అనే ఉన్నతాధికారి ఉండేవాడు. ఇప్పటి మధ్యప్రదేశ్లోని అగర్‌ మాల్వా అనే ప్రదేశంలో మార్టిన్‌ విధులు నిర్వహించేవాడు. మార్టిన్కు ఓసారి ఆఫ్ఘనిస్థాన్‌ వెళ్లవలసిన పని పడింది. అక్కడి బ్రిటీష్‌ వారి మీద తిరుగుబాటు చేస్తున్న ఆఫ్ఘన్లను అణచివేయవలసిందిగా, ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది. తన సైన్యంతో సహా ఆఫ్ఘనిస్తాన్‌ చేరుకున్న కల్నల్‌ మార్టిన్‌, అక్కడి సైనికులతో వీరోచితంగా పోరాడాడు.

నిత్యం పోరులో ఎంతగా తలమునకలై ఉన్నా, అగర్‌ మాల్వాలో ఉన్న తన భార్యకు తన క్షేమ సమాచారాలు తెలియచేస్తూ తప్పకుండా ఉత్తరాలు రాసేవాడు. కొద్ది రోజులు గడిచేసరికి కల్నల్‌ భార్యకు ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. అక్కడ తన భర్త ఎలాంటి ఆపదలో ఉన్నాడో, అసలు బతికున్నాడో లేదో తెలియని వేదనలో మార్టిన్‌ భార్య మునిగిపోయింది. ఒక రోజు లేడీ మార్టిన్‌ అగర్‌ మాల్వాలో తిరుగుతుండగా… ఓ శివాలయం నుంచి మంత్రాలు, శంఖనాదాలు వినిపించాయి. భర్త వియోగంలో ఉన్న ఆమెకి, ఆ పవిత్ర శబ్దాలు ఊరటని అందించాయి. లేడీ మార్టిన్‌ స్థితిని గమనించిన ఆలయ పూజారులు ఆమె అంత దుఃఖంలో మునిగిపోయి ఉండటానికి కారణం ఏమిటా అని ఆరా తీశారు. దానికి ఆమె చెప్పిన సమాధానం విని, పదకొండు రోజుల పాటు ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని కనుక జపిస్తే, మృత్యుంజయుడైన ఆ శివుడు ఆమె భర్తను కాపాడతాడని సూచించారు. అప్పటివరకూ నిరాశలో మునిగిపోయిన లేడీ మార్టిన్‌కు ఆ సూచన అమృతప్రాయంగా తోచింది.

agar malwa baijnath temple do you know who built it

లేడీ మార్టిన్‌ తనకు పూజారులు చెప్పినట్లుగానే శివుని ప్రార్థించసాగింది. సరిగ్గా పదకొండవ రోజున ఆమెకు తన భర్త నుంచి ఒక ఉత్తరం వచ్చింది. మా సైన్యాన్ని ఒక్కసారిగా పఠాన్లు చుట్టుముట్టారు. నలువైపులా వారి దిగ్బంధనంలో ఉన్న మేము ఇక చావే గతి అన్న నిశ్చయానికి వచ్చాం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ… పులి చర్మం ధరించి, త్రిశూలం చేతపట్టిన ఒక భారతీయ యోగి మాకు అండగా నిలిచాడు. ఆయనను చూసిన వెంటనే శత్రువులు పరుగులు తీశారు. నేను మృత్యువుకి భయపడాల్సిన అవసరం లేదనీ, నా భార్య ప్రార్థనలను మన్నించి నన్ను రక్షించేందుకే అక్కడికి వచ్చాననీ…. ఆ యోగి నాతో చెప్పారు, అని ఉన్న ఆ ఉత్తరాన్ని చూసి లేడీ మార్టిన్‌ నోట మాట రాలేదు. కల్నల్‌ మార్టిన్‌ యుద్ధభూమి నుంచి క్షేమంగా తిరిగిరాగానే ఇక్కడ జరిగిన విషయమంతా ఆయనకు చెప్పింది లేడీ మార్టిన్‌.

అప్పటి నుంచి ఆ దంపతులు ఇద్దరూ శివభక్తులుగా మారిపోయారు. ఆ శివాలయాన్ని అభివృద్ధి చేయాలని తలపెట్టారు. బైజ్నాథ్‌ మహాదేవ్‌ పేరుతో ఉన్న ఆ శివాలయం నిజానికి ఎప్పుడో 13 శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెబుతారు. కానీ స్థానికులు మాత్రం అది వేల ఏళ్లనాటిదని నమ్ముతారు. అలాంటి విశిష్టమైన దేవాలయాన్ని మార్టిన్‌ దంపతులు పునరుద్ధరించాలని అనుకున్నారు. అందుకోసం అప్పట్లోనే 15 వేల రూపాయలని ఆలయానికి విరాళంగా అందించారు. ఆ విరాళానికి స్థానికుల సహకారం తోడై మధ్యప్రదేశ్లోనే అద్భుతమైన శివాలయాలలో ఒకటిగా అగర్‌ మాల్వా బైజ్నాథ్‌ ఆలయం నిలిచింది. మార్టిన్‌ దంపతుల కథ నిజమేనని నిరూపించేందుకు ఇప్పటికీ అక్కడి ఆలయంలో వారి విరాళం గురించిన శిలాఫలకం కనిపిస్తుంది. భక్తి ఉంటే చాలు భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని చెప్పిన ఈ గాథ చదివారు కదా. మీరు భక్తితో భగవద్‌ ఆరాధన చేయండి. పరమాత్ముడి అనుగ్రహం పొందండి.

Tags: agar malwa baijnath temple
Previous Post

ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఇలా చేయ‌డం మ‌రిచిపోకండి..!

Next Post

జ‌పం ఎలా చేయాలి..? జ‌పం చేస్తే ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయి..?

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.