Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో జుట్టులో ఉండే పేల‌ను ఎలా తొల‌గించుకోవచ్చో తెలుసుకోండి..!

Admin by Admin
April 20, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

త‌ల‌పై ఉన్న వెంట్రుక‌ల్లో చుండ్రు త‌రువాత అధిక శాతం మందికి ఇబ్బందికి క‌లిగించేవి పేలు. వాటితో జుట్టు కుదుళ్ల వ‌ద్ద దుర‌ద‌గా ఉండి ఎప్పుడూ నెత్తి గోక్కోవాల్సి వ‌స్తుంటుంది. ఈ క్ర‌మంలో పేల కార‌ణంగా చుండ్రు స‌మ‌స్య‌, పొట్టు రాలడం వంటివి కూడా ఎక్కువైపోతాయి. కేవ‌లం పెద్ద‌ల‌కే కాదు చిన్నారుల‌కు కూడా పేలు ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే వాటిని తొల‌గించుకునేందుకు మాత్రం అధిక శాతం మంది నానా తంటాలు ప‌డుతున్నారు. కానీ కింద ఇచ్చిన కొన్ని సూచ‌న‌లు పాటిస్తే పేల స‌మ‌స్య నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బాదం లేదా ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని జుట్టును చిన్న చిన్న భాగాలుగా చేసి ఆ ఆయిల్‌ను అప్లై చేయాలి. అనంతరం వేడి నీటిలో దువ్వెన ముంచి దాంతో వెంట్రుక‌ల‌ను కుదుళ్ల నుంచి దువ్వాలి. అనంత‌రం షాంపూతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే పేల స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

బాదం, ఆలివ్ ఆయిల్స్ లాగే న‌ట్‌మెగ్‌, పెప్ప‌ర్‌మింట్‌, రెడ్ థైమ్‌, దాల్చిన చెక్క‌, యూక‌లిప్ట‌స్‌, ల‌వంగం, లావెండ‌ర్ ఆయిల్స్ కూడా పేల నుంచి విముక్తిని ఇస్తాయి. ఈ ఆయిల్స్‌లో దేన్నైనా 15 నుంచి 20 చుక్క‌ల మోతాదులో తీసుకుని దానికి 60 ఎంఎల్ మోతాదులో ఆలివ్ ఆయిల్ క‌లిపి జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా బాగా రాయాలి. దాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. ఉద‌యాన్నే త‌ల‌ను బాగా దువ్వి షాంపూతో త‌ల‌స్నానం చేస్తే పేలు తొల‌గిపోతాయి. వాజెలిన్ లేదా కొబ్బ‌రినూనెను కొద్దిగా తీసుకుని జుట్టుకు బాగా ప‌ట్టించాలి. అనంతరం త‌ల‌కు ష‌వ‌ర్ క్యాప్ చుట్టి 12 నుంచి 24 గంట‌ల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత షాంపూతో త‌ల‌స్నానం చేసి మ‌ళ్లీ ష‌వ‌ర్ క్యాప్‌ను 30 నిమిషాల పాటు చుట్టాలి. త‌రువాత తుల‌సి ఆకు ర‌సాన్ని త‌ల‌కు ప‌ట్టించి దువ్వెన‌తో బాగా దువ్వాలి. మ‌ళ్లీ షాంపూతో త‌ల‌స్నానం చేయాలి. చివ‌రిగా ఒక‌సారి మళ్లీ ష‌వర్ క్యాప్ పెట్టి రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే మ‌ళ్లీ త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పేలు పోతాయి.

how to remove head lice follow these remedies

2 సంవ‌త్స‌రాల లోపు ఉన్న వారికైతే ఎలాంటి ప‌దార్థాల‌ను వాడ‌కుండా సుల‌భంగా పేల‌ను తొలగించుకోవ‌చ్చు. ఇందుకోసం పేల దువ్వెన‌ను ఉప‌యోగించాలి. ఆ దువ్వెన‌తో బాగా దువ్వి షాంపూతో త‌ల‌స్నానం చేయించాలి. స్నానం అనంత‌రం మళ్లీ దువ్వాలి. ఇలా 3 నుంచి 4 రోజుల‌కు ఒక‌సారి చేస్తే చిన్నారుల త‌ల‌ల్లో పేలు ప‌డ‌వు. వేప నూనెలో యాంటీ ఇన్‌సెక్టిసైడ్ గుణాలు ఉన్నాయి. ఇవి పేల‌ను పార‌దోలుతాయి. సాధార‌ణంగా వాడే షాంపూలో కొద్దిగా వేప నూనెను క‌లిపి దాన్ని జుట్టుకు రాసి త‌ల‌స్నానం చేస్తూ ఉంటే పేలు ఇట్టే పోతాయి. 8 నుంచి 10 వెల్లుల్లి రేకుల్ని తీసుకుని వాటిని ముద్ద‌గా చేయాలి. ఆ మిశ్ర‌మానికి 2-3 టీస్పూన్ల నిమ్మ ర‌సం క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి 30 నిమిషాల పాటు ఆగాలి. త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చొప్పున చేసినా పేలు త్వ‌ర‌గా త‌గ్గిపోతాయి.

కొద్దిగా బేబీ ఆయిల్‌ను తీసుకుని జుట్టుకు ప‌ట్టించాలి. అనంత‌రం కొద్ది సేపు ఆగాక దువ్వెన‌తో జుట్టును బాగా దువ్వి గోరు వెచ్చ‌ని నీరు, షాంపూతో త‌ల‌స్నానం చేయాలి. అలా చేశాక జుట్టుకు వైట్ వెనిగ‌ర్‌ను ప‌ట్టించి త‌ల‌కు ష‌వ‌ర్ క్యాప్‌ను ఉంచాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే మ‌ళ్లీ త‌ల‌స్నానం చేస్తే పేలు పోతాయి. నువ్వుల నూనెలో యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ ఇన్‌సెక్టిసైడ‌ల్ గుణాలు ఉన్నాయి. ఒక క‌ప్పులో నాలుగో వంతు నువ్వుల నూనెలో కొంత వేప నూనె, యూక‌లిప్ట‌స్ ఆయిల్‌, రోజ్‌మేరీ ఆయిల్‌, లావెండ‌ర్ ఆయిల్‌ల‌ను వేసి బాగా క‌ల‌పాలి. ఈ ఆయిల్ మిక్చ‌ర్‌ను జుట్టుకు బాగా ప‌ట్టించాక‌, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను కొద్దిగా తీసుకుని దాన్ని జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా అప్లై చేయాలి. అనంత‌రం త‌ల‌కు ఒక ష‌వ‌ర్ క్యాప్‌ను పెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉద‌యాన్నే షాంపూతో త‌ల‌స్నానం చేయాలి. దీని వ‌ల్ల పేలు త్వ‌ర‌గా త‌గ్గిపోతాయి.

Tags: head lice
Previous Post

మాన‌స స‌రోవ‌రంలో ఒక ఫోటోగ్రాఫ‌ర్ తీసిన ఈ హ‌నుమాన్ ఫొటో నిజ‌మేనా..?

Next Post

సైన‌స్ స‌మ‌స్య ఎక్కువ‌గా బాధిస్తోందా..? అయితే ఇలా చేయండి. వీటితో వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.