వాస్తు ప్రకారం క్యాలెండర్‌ను ఇంట్లో ఉత్తరం, పడమర లేదా తూర్పు దిశలో ఉంచడం మంచిది. ఈ దిశలలో క్యాలెండర్‌ను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. శ్రేయస్సు, పురోగతి కలుగుతాయి. తూర్పు దిశలో క్యాలెండర్‌ను ఉంచడం వల్ల అదృష్టం, అవకాశాలు వస్తాయి. పడమర దిశలో క్యాలెండర్‌ను ఉంచడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది.
ఉత్తరం దిశలో క్యాలెండర్‌ను ఉంచడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది. క్యాలెండర్‌ను ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం దిశలో ఉంచకూడదు. క్యాలెండర్‌ను ప్రవేశ ద్వారం దగ్గర ఉంచకూడదు. ఇంట్లో ఖాళీగా ఉన్న గోడకు క్యాలెండర్‌ను వేలాడదీయడం మంచిది కాదు.
క్యాలెండర్‌ను హింసాత్మక జంతువుల చిత్రాలు లేదా విచారకరమైన ముఖాలతో ఉండే చిత్రాలతో కూడిన గోడపై ఉంచకూడదు. క్యాలెండర్‌ను మీ బెడ్‌రూమ్ నుండి దూరంగా ఉంచాలి.