హైదరాబాద్ లో చాలా మందికి తెలియని, మీరు సందర్శించిన ఆసక్తికరమైన ప్రదేశం ఏది ?

ఆనంద బుద్ధ విహార ట్రస్ట్. ఇది సికిందరాబాద్ మహేంద్ర హిల్స్ గుట్ట పై చివరన ఉంది. ఇది ఆదివారం సెలవు. శనివారం మధ్యాహ్నం నుండి కూడా తెరిచి ఉండదు. ఇతర సమయాల్లో దర్శించుకోవచ్చు.

ప్రశాంతమైన బుద్ధ విగ్రహం, నిశ్శబ్దమైన పరిసరాలు, రమణీయమైన ప్రకృతి ఈ చోట నెలకొని ఉన్నాయి. ఈస్ట్ మారేడ్ పల్లి మెయిన్ రోడ్డు నుంచి వీలైతే నడుచుకుని వెళితే ఆహ్లాదంగా ఉంటుంది. దార్లో ఓ అందమైన కోవెల ఏదో ఉంది. అలాగే ఈ దారిలో చిన్న చిన్న కొట్లలో దొరికే టీ చాలా బావుంటుంది.

budha vihar trust in hyderabad

ఇక్కడ బౌద్ధ సాహిత్యానికి చెందిన అద్భుతమైన పుస్తకాలు కూడా దొరుకుతాయి. ఆసక్తి ఉన్నవారు కొంత డబ్బు ట్రస్ట్ కు వితరణ చేసి ఆ పుస్తకాలు తెచ్చుకోవచ్చు.

గుడి పై నుంచి నగరదర్శనం కూడా సుందరంగా ఉంటుంది.