Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

మీ ఇంటి కుల‌దైవాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ విస్మ‌రించ‌కూడ‌దు.. క‌చ్చితంగా పూజించాలి.. ఎందుకంటే..?

Admin by Admin
June 6, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎల్లలు దాటినా.. పుట్టిన ఊరును,కన్న తల్లితండ్రలను పట్టించుకోవాలంటారు.. వీటితో పాటు.. మీ కులదైవాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కులదైవాన్ని విస్మరిస్తే..మీరు ఏ దిక్కున ఉన్న ఆ అమ్మ ఆగ్రహానికి బలైపోవాల్సిందే అంటున్నారు కొందరు.. కోరికలు సిద్ధింపజేసే కులదైవాన్ని విస్మరిస్తే కలిగే నష్టాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం. చాలా మందికి ఇంటి దేవతలుగా గ్రామ దేవతల వంటి వారే ఉంటారు. కొద్ది మందికి మాత్రం పురాణ దేవతలు కూడా కులదైవాలుగా ఉంటారు. కొందరికి దక్షిణామూర్తి, మరికొందరికి హయగ్రీవుడు కులదైవాలుగా ఉంటే మరి కొందరికి నరసింహస్వామి, వేంకటేశ్వరుడు, శ్రీరాముడు, పాండురంగడు ఇంటి దేవుళ్లుగా ఉంటారు. గృహంలో జరిగే ఏ శుభకార్యంలోనైనా గృహస్థులు ఈ దేవతలకు ప్రాధాన్యతను ఇచ్చి మొదట పూజించి తర్వాత ఇతర కార్యక్రమాలు జరుపుకోవడం ఆనవాయితీ.

కుటుంబంలో సుఖ శాంతులు నిలిచి ఉండాలని పూర్వీకుల నుంచి కూడా కులదేవతారాధన చేస్తూ వచ్చారు. కుల దైవం కుటుంబాన్ని కాపాడుతుంది. కులదైవాన్ని మరిస్తే కుటుంబం చుట్టూ ఆవరించి ఉన్న దైవ శక్తి రక్షణ చక్రం కనుమరుగవుతుంది. దీని కారణంగా ప్రమాదాలు, ప్రతికూల శక్తుల విజృంబణ, అనారోగ్య సమస్యలు వస్తాయి.. రకరకాల అడ్డంకులతో కుటుంబ పురోగతి దిగజారుతుంది. కుటుంబంలో సంస్కారం క్షీణించడం, అనైతికత, అసమ్మతి, అశాంతి చెలరేగుతాయి. గ్రహచారం బాగున్నా కుటుంబంలో సంక్షేమం ఉండదు. కులదైవానికి సముచిత స్థానం ఇవ్వక పోయినా, సరైన గౌరవం దక్కకపోయినా, సరైన రీతిలో ఆరాధించకపోయినా వారి శక్తి నశించి కుటుంబం కుంటుపడుతుంది. అలా జరిగితే మీరు ఏ దేవతారాధన చేసినా కూడా అది వారికి చేరదట. బయటి నుంచి వచ్చే దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు చాలా సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తాయి.

why we should definitely do pooja to our kula daivam

ప్రతి కుంటుంబానికి వారి కుల దైవానికి సంబంధించిన ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది. ఆ ఆచారాన్ని అనుసరించి ఏడాదిలో ఒకసారి లేదా రెండు సార్లు ప్రత్యేకమైన రోజులలో కులదైవారాధాన ప్రత్యేకంగా చేస్తారు. ఇది కాకుండా శుభకార్యాల సమయంలో తప్పకుండా కుల దైవారాధన చేసుకోవాల్సి ఉంటుంది. కులదేవతను విస్మరిస్తే జన్మ జాతకాల్లో దోషాలు ఏర్పడుతాయి. మంచి గ్రహ రాశులు కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. తల్లిదండ్రులను, కుల దైవాన్ని పూజించి వారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. వారి ఆశీర్వాదం లేకుండా ఇంకెలాంటి ఆశీర్వాదం లభించదు. కులదేవతారాధన విస్మరించిన కుటుంబంలో నిరంతరం ఏదో ఒకరకమైన కలతలు వేధిస్తూ ఉంటాయి. పరిసరాల్లో ఉండే వ్యక్తులతో కూడా అనవసరపు స్పర్థలు ఏర్పడుతాయి. పిల్లలతో, తల్లిదండ్రులకు సరైన సయోధ్య లేక నిరంతరం ఇంట్లో వేదనా భరిత వాతావరణం ఉంటుంది.

ఏదో ఒక కారణంతో భార్యాభర్తల మధ్య విబేధాలు చేలరేగి వారి మధ్య ఆనందం లేకుండా పోతుంది. ఈ కాలంలో కూడా ఇవన్నీ ఎవరు నమ్ముతారు అని లైట్‌ తీసుకునేవాళ్లు ఉండొచ్చు.. నమ్మకం ఉన్న వారు మాత్రం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవడం మంచిది.. మీ ఇంట్లో కారణం లేకుండా నిరంతరం ఏదో ఒక చికాకు వెంటాడుతుంటే.. ఈ దిశగా ఆలోచించి చూడమని పండితులు సూచిస్తున్నారు.

Tags: yellamma
Previous Post

రోడ్డు మీద డ‌బ్బు క‌నిపిస్తే తీసుకోవ‌చ్చా.. ఏదైనా న‌ష్టం క‌లుగుతుందా..?

Next Post

చెవుల్లో ఉండే గులిమిని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి..!

Related Posts

ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025
హెల్త్ టిప్స్

అంద‌మైన వ‌క్ష సంప‌ద కావాలంటే.. అమ్మాయిలు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

July 23, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశులు ఉన్న‌వారు రెండు స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటార‌ట‌..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.