Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

నిద్రించే సమయంలో గురక విపరీతంగా వస్తుందా..? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి !

Admin by Admin
July 2, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆధునిక జీవితంలో ఆరోగ్య సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ముఖ్యంగా ఉబకాయం, స్థూలకాయ సమస్యలతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానమైనది గురక. నిద్రించే సమయంలో గురకపెట్టే అలవాటు చాలామందిలో ఉంటుంది. అందరి ఇళ్లలో ఎవరో ఒకరు గురక సమస్యతో బాధపడుతుంటారు. గురక పెడుతున్న విషయం కుటుంబ సభ్యులు చెప్పేంతవరకు వారు తెలుసుకోలేరు. వారి గురక కారణంగా పక్కన వారికి నిద్ర కరువు అవుతుంది. దీన్ని అధిగమించడానికి ఈ సూచనలను పాటించడం వల్ల గురకపెట్టడాన్ని తగ్గించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రకరకాల మానసిక ఒత్తిళ్లు, సమస్యలతో నిద్ర మాత్రలు వాడేవారు, మత్తు పానీయాలు వాడేవారు, ధూమపాన ప్రియులు ఎక్కువగా గురక బారిన పడుతుంటారు. నాసిక రంధ్రాలు సరిగా పనిచేయకపోయినా, జలుబుతో బాధపడుతున్నా, టన్సిల్స్ వాపు ఉన్నా కూడా గురక రావచ్చు.

అంతేకాదు గురక పెట్టే వారికి నిద్రలేమి, పక్షవాతం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇదిలా ఉంటే సాధారణంగా కొందరు రాత్రుళ్ళు ఒక పెగ్గు వేయనిదే నిద్రపోరు. అయితే గురక రావడానికి మద్యం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. కాబట్టి నిద్రించే ముందు మద్యానికి వీలైన అంతవరకు దూరంగా ఉండాలి. అలాగే జలుబు చేసినప్పుడు కూడా ముక్కు క్లోజ్ అయిపోతుంది. దీనివల్ల గురక పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే మనం మొదట ముక్కును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అధిక బరువు కూడా గురకకు ఒక కారణం. ఈ గురక సమస్యకు ఎలా చెక్ పెట్టాలంటే.. అరటిపండు, పైనాపిల్, కమలాపండ్లు .. ప్రశాంతమైన నిద్ర, గురక సమస్యను తగ్గిస్తుంది.

how to reduce snoring problem know these tips

శరీరంలో మెలటోనిన్ సరైన స్థాయిలో ఉత్పత్తి అయితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల గురక సమస్యకు చెక్ పెట్టొచ్చు. అలాగే రాత్రులు నిద్రించే ముందు అర టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అర టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే గురకరాకుండా ఉంటుంది. లేదా రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక వెల్ల‌కిలా పడుకున్నప్పుడు గురక అనేది ఎక్కువగా వస్తుంది. అందుకని నిద్రించే సమయంలో పక్కకు తిరిగి పడుకోవాలి. యోగ, ప్రాణాయామం అలవాటు చేసుకోవడం వల్ల గురక సమస్యను దూరం చేసుకోవచ్చు. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు పాలలో రెండు చెంచాల పసుపు కలుపుకుని తాగడం వల్ల కూడా గురక సమస్య దూరం అవుతుంది.

Tags: snoring
Previous Post

రామాయణం ద్వారా మ‌నం నేర్చుకోద‌గిన విష‌యాలు ఇవే..!

Next Post

లాయర్ కి, అడ్వకేట్ కి మధ్య ఉన్న తేడా మీకు తెలుసా ?

Related Posts

హెల్త్ టిప్స్

సుద్ద‌, పెయింట్‌, మ‌ట్టి తింటున్నారా..? అయితే ఆ అల‌వాటును ఇలా మానేలా చేయ‌వ‌చ్చు..!

July 24, 2025
mythology

శ్రీ‌కృష్ణుడు ఎన్ని శాపాల‌ను ఎదుర్కొన్నాడో తెలుసా..?

July 24, 2025
వినోదం

విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు..!

July 24, 2025
ఆధ్యాత్మికం

శివ‌పార్వ‌తుల వివాహం జ‌రిగిన చోటు ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా..?

July 24, 2025
హెల్త్ టిప్స్

మ‌ద్యం సేవించ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మానేయ‌వ‌చ్చు..!

July 24, 2025
lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.