Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఎలాంటి స‌మ‌స్య ఉన్నా స‌రే సుంద‌ర కాండ పారాయ‌ణం చేస్తే చాలు..!

Admin by Admin
March 13, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

రామాయణం అంటే తెలియని భారతీయుడు ఉండరు. అలాంటి దివ్య ఇతిహాసంలో అత్యంత ప్రధానమైన కాండ సుందరకాండ. ఇది ఒక జరిగిన కథే కాదు. దీనిలో ప్రతి ఘట్టం సకల దోష నివారణకు దివ్యౌషధం. అలాంటి సుందరకాండ అంతా హనుమంతుడి చుట్టూ తిరుగుతుంది. హనుమంతుడు సీతామాతను కలవడం, రావణ లంకను చూడటం, సీతజాడను రాముడికి చెప్పడటమే కాదు రామయణాన్ని సంక్షిప్తంగా పూర్తిగా చెప్పిన కాండ కూడా ఇదే కావడం విశేషం. మహాభారతంలో భగవద్గీత, రామాయణంలో సుందరకాండ నిత్యపారాయణ గ్రంథాలన్న భావన లోకంలో ఉంది. ఎవరు చెప్పినా ఈ రెండింటి గురించీ చెబుతుంటారు. ఇందులో మరో విశేషం కూడా ఉంది. వాల్మీకి మహర్షి అన్నికాండల్లోనూ ఫలశ్రుతి చెప్పారు. ఈ కాండలో మాత్రం కాండ ఫలశ్రుతితో బాటు కొన్ని ముఖ్య ఘట్టాల్లోనూ ఫలశ్రుతిని చెప్పారు.

సుందరకాండలో వర్ణించిన శ్రీరామచంద్రుడు పరమ సుందరుడు, అందులోని కథ పరమ సుందరం, సీతాదేవి పరమ సుందరి, ఆమె ఉన్న వనం పరమ సుందరమైనది, కావ్యం మరింత సుందరమైనది, హనుమంతుడు సుందరుడు, మంత్రం కూడా సుందరమే. ఈ కాండలో సుందరం కానిది ఏమున్నది? అని శ్లోకార్థం. సుందరకాండ ఫలశ్రుతిని గురించి రామాయణమేగాక, స్కాందపురాణం బ్రహ్మాండ పురాణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోను కనిపించడం దీని వైశిష్ట్యాన్ని చెబుతున్నది. వీటిని పరిశీలించి చూస్తే వాల్మీకి ఈ కాండం నుంచి నేటి సమాజానికి కూడా పనికి వచ్చే పరమాద్భుతమైన ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడనిపిస్తుంది.

do sundarakanda parayanam for any problems

సుందర కాండలో హనుమంతుడే కథానాయకుడు. రామాయణంలోని ప్రతికాండలోనూ శ్రీరాముని ప్రత్యక్ష దర్శనం ఉంటుంది. ఇందులో చివర్లో మాత్రమే రామచంద్రుడు కనిపిస్తాడు. కానీ కథంతా శ్రీరామ కార్యసాధనతో ముడిపడి ఉంటుంది. సీతాన్వేషణ నిమిత్తం బయల్దేరిన వానర వీరుల్లో దక్షిణ దిశగా పయనించిన అంగద, జాంబవంత, హనుమంతాది మహావీరులు కార్యసాధన చేసుకొని తిరిగి రాగలరన్న విశ్వాసం రామునిలో పుష్కలంగా ఉంది. ముఖ్యంగా హనుమంతునిపై మరింత నమ్మకముంది గనుకనే అంగుళీయకం హనుమకే ఇచ్చాడు. స్వామి కార్యనిర్వహణ ఎంత దుస్తరమైనదైనా ఫలవంతం చెయ్యాలన్న పట్టుదల ఉండాలన్నది హనుమంతుని ద్వారా రామాయణం మనకు చెబుతున్నది.

అలాగే.. తాను ఎవరి పక్షాన వచ్చాడో అతని శక్తి ఎంతటిదో చెప్పి శత్రువును హెచ్చరించే స్థాయిని ఈ కాండలోనే మనం చూడగలం. చంపదలచి తోకకు నిప్పంటించినప్పుడు అదే నిప్పుతో లంకా దహనం చేసి తమ విజయం తథ్యమన్న సంకేతాన్నివ్వడమే గాక, రామాయణంలోని ముఖ్య ఘట్టమైన రావణ వధ, రాక్షస వినాశనం కూడా జరిగి తీరుతుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పిన కార్యశీలి హనుమంతుడు. మహా కార్యనిర్వహణ చేయడం గురించి అడుగడుగునా తెలిపే సుందరకాండం నిత్యపారాయణ యోగ్యమనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

ముఖ్యంగా కార్యజయం, చదువులో అత్యున్నత స్థానానికి ఎదగాలనుకునేవారు, వివాహం కానివారు, సంతాన ప్రాప్తి, నవగ్రహదోషాలు, అనారోగ్య సమ్యలు, ఆర్థిక బాధలు, ఈతి బాధలు, కుటుంబ సమస్యలు, ఇలా రకరకాల సమస్యలకు సుందరకాండ పరమౌషధం అని పండితుల అభిప్రాయం. మీకు దగ్గర్లోని సుందరకాండ పారాయణం చేసే పండితుల దగ్గరకు వెళ్లి మీ సమస్యలకు పరిష్కారాన్ని సుందరకాండ పారాయణంతో చేసుకోండి. పారాయణం చేయించుకోవడం ఇబ్బంది ఉంటే సుందరకాండ పుస్తకాన్ని కొనుక్కొని ప్రతీరోజు ఒక పుష్పం దానిపై ఉంచి ప్రార్థన చేసినా మీకు తప్పక మంచి జరుగుతుందని శాస్త్రవచనం. ఇక ఆలస్యమెందుకు అన్ని బాధలు తీరడానికి భక్తితో, శ్రద్ధతో సుందరకాండ పారాయణం చేయండి. సకల శుభాలను పొందండి.

Tags: sundarakanda parayanam
Previous Post

క‌ల‌లో పాము క‌నిపించిందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Next Post

వారంలోని 7 రోజుల్లో ఏ రోజు పుడితే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.