నరుని కంటికి నల్లరాయి కూడా పగులును అనేది ఒక నానుడి. అవును.. నరుని దృష్టిలో అతనికే తెలియని దుష్ట అగ్ని శక్తి ఉంటుంది. అందుకే దేవాలయం ప్రతిష్ట జరిగిన తర్వాత దేవతా మూర్తిని ముందుగా భక్తులకు అద్దంలో దర్శించిన తర్వాత నిజదర్శనం చేస్తారు . నర దృష్టి ఇంట్లో అభివృద్ధిని చిన్నాభిన్నం చేసి బాధలకు గురిచేయును. ఈర్ష్య, అసూయ, ద్వేషాదులు మనిషి అభివృద్ధిని ఒక్కసారిగా కుంటుపడేలా చేస్తాయి. ఈ నరఘోష యంత్రం ధరించిన వారికి పది దిక్కుల యొందు ఎవరు ఏ దిక్కు నుంచి ఘోచించిన దృష్టి తగలకుండా కాపాడును. వారి కను దృష్టి తిరిగి వారికే తగిలేలా చేయును. అయితే నరదృష్టిని నివారించడానికి శుభ దృష్టి గణపతినే కన్ను దృష్టి గణపతి, దిష్టి గణపతి అని కూడా అంటారు. నివాస స్థలాలలో, వ్యాపార ప్రదేశాలలోనూ స్వామి వారి పటాన్ని ఉంచడం వల్ల తీవ్రమైన నదదృష్టి, నరఘోష నుండి కాపాడబడతాము. అదెలాగో చూద్దాం..
శాస్త్రీయ దృష్టితో గమనించినట్లైతే శుభ దృష్టి గణపతి ఉండటం వల్ల ఆ పరిసర ప్రదేశాల్లో చెడుకి కారణమయ్యే తరంగాలు నివారించడతాయి. శుభ దృష్టి గణపతి కలశ కిరీటాన్ని, మూడు కన్నులను కలిగి ఉంటారు. అష్ట భుజాలతో (ఎనిమిది చేతులతో) ఉంటాడు. కుడివైపున నాలుగు చేతులతో త్రిశూలాన్ని , ఖడ్గాన్ని , చక్రాన్ని, అంకుశాన్నీ ధరించి ఉంటాడు. ఎడమవైపున అగ్నిని , గదని, శంఖాన్ని పాషాన్ని కలిగి ఉండి సింహవాహనుడై దేదీప్యమానంగా వెలుగొందుతాడు. శుభ దృష్టి గణపతిని ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు ముందువైపున ఉంచాలి. వ్యాపార సంష్టాలు, సముదాయాల మరియు ఇళ్ళలో సింహద్వారానికి పైన బయటివైపున ఉంచాలి. బయటి నుంచి ఇంట్లోకి వచ్చే వారికి కనబడే విధంగా ఉండాలి.
అలాగే నరదోష యంత్రం ధరించాలి. ఈ యంత్రంలో ఉండే పది త్రిశూలాలు, పది దిక్కుల నుండి వచ్చే నరఘోషను దృష్టి దోషాన్ని , ప్రయోగదోషాలను , ఈర్ష్య అసూయలను పారద్రోలుతుంది. అష్టదిక్పాలకులు అనుగ్రహం కలుగచేసి, మట్టిలో నుంచి దోషాలను హరించి ఆయుర్ధాయము ఇంటికి పూర్వవైభం చేకూర్చుతుంది. గృహంకు ప్రవేశ ద్వారం ఎదురుగా నరఘోష యంత్రం ఉంటే.. అది నరఘోష లేదా నరదృష్టి నుంచి వచ్చే అనార్థాలను, అడ్డంకులను ఇంటి బయటకే పంపించి వేస్తుంది. ఈ యంత్రం ఫలం గాలి, చీడ, పీడ సమస్త ప్రయోగ దోషాలను హరించి, ఆరోగ్యం ప్రశాంతతను చేకూర్చును. విజయవంతంగా అభివృద్ధి పథంలో నడిపించును. నర ఘోష నుంచి మిమ్ముల్ని రక్షిస్తుంది.