Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

మీకు ఏలినాటి శ‌ని దోషం ఉందా.. అయితే ఇలా చేయండి చాలు..!

Admin by Admin
March 12, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలామందికి నిత్యం ఎన్నో సమస్యలు. తరుచూ ప్రమాదాల బారిన పడుతుంటారు. అంతేకాదు ఆర్థికంగా ఇబ్బందులు, అనవసర వివాదాలు… ఇలా ఒకటేంటి పలు రకాల సమస్యలు, ఇబ్బందులు. వీటికి కారణం శనిదోషం కావచ్చు. ఒకవేళ మీ జాతక దశలు తెలిస్తే శనిదోషం ఉన్నా లేకుంటే పైన చెప్పిన బాధలు ఉంటే కింది తంత్రాలను ఆచరించండి తప్పక మీకు శని దోషాలు పోవడమే కాదు మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఆలస్యమెందుకు వివరాలు చూద్దాం…

ముఖ్యంగా ఏలినాటి శని మిమ్మల్ని పీడిస్తున్నట్లైతే.. గుడ అంటే బెల్లం సహిత తిలదాన, హోమ, జపాదులను చేయండి. శనివారం పూట నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదక్షణ చేసి, శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా కొన్ని సమస్యలు దరిచేరవు. ఇలా తొమ్మిది వారాలు చేస్తే ఏలినాటి శని ప్రభావంతో కలిగే దోషాలు, కష్టనష్టాలు దూరమయ్యే అవకాశం ఉంది. అలాగే ఏలినాటి శనిదోష నివారణకు శని విగ్రహాన్ని ఇనుముతో చేయించి, దానిని ఓ మట్టి కుండలోగానీ, ఇనుప పాత్రలో గానీ ఉంచాలి. దానిపై నల్లని వస్త్రమును కప్పి నల్ల పుష్పములు నల్ల గంధం, నల్లని పత్రములతో పూజించి బ్రాహ్మణునికి సువర్ణ సహితముగా దానమివ్వాలి. దానితో పాటు నువ్వులు, పులగం దానము చేసినచో ఏలినాటి శని కొంతమేరకైనా నివృత్తి అగును. మయూరి నీలం ధరించుడం చేయండి తప్పక శనిదోష తీవ్రత తగ్గడం మంచి జరగడం జరుగుతుంది. ఒకవేళ మీకు నిజంగా పై పూజలు, తంత్రాలు చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే కింద చెప్పిన ఏదైనా ఒకదాన్ని చక్కగా భక్తితో, విశ్వాసంతో చేయండి తప్పక మీ దోషాలు పోతాయి. అవి ఏంటో చూద్దామా…

if you have yelinati shani dosham do these remedies

శని జపం ప్రతి రోజు జపించుట, శనికి తిలాభిషేకం చేయడం, శివునికి అభిషేకం ప్రతి శనివారం రోజు చేయడం చేయండి లేదా శనివారం రోజు నవగ్రహాల ఆలయ ప్రదక్షణలు, ప్రసాదం పంచుట, ప్రతిరోజు నువ్వుండలు కాకులకు పెట్టుట వలన, హనుమంతుని ఆకుపూజ చేయండి లేదా అవకాశం ఉంటే సుందరకాండ లేదా నలచరిత్ర చదువుకోండి తప్పక మంచి జరుగుతుంది. ప్రవహించే నీటిలో అంటే కాలువులు, నదుల్లో నల్లటి వస్తువులు అంటే బొగ్గులు, నల్ల నువ్వులు మేకు వేసి కాళ్లు కడుక్కోని దేవునికి మనస్సులో నమస్కారం చేసుకోవడం. శని 11 నామాలు చదవుకోండి ( శనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షణం చేయండి. నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం, ప్రతి శనివారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాళ్ల కు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన , అయ్యప్ప మాల ధరించుట వలన శ్రీ వేంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చుట వలన శ్రీ వేంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన ప్రతి శనివారం వేంకటేశ్వర స్వామి,శివుని, హనుమంతుని దర్శనం, కాలభైరవ పూజ వల్లనూ వలన శని గ్రహ దోషం శాంతించి తప్పక మీకు మంచి జరుగుతుంది. ఇవీ కూడా వీలుకాకుంటే నల్లని చీమలకు కొన్ని బియ్యం గింజలను వేయండి, దశరథ శనిస్తోత్రాన్ని చదువుకోండి లేదా హనుమాన్‌చాలీసాను ప్రతిరోజు చదవండి తప్పక మీకు చెడుదోషాలు పోతాయి. విజయాలు చేకూరుతాయి.

Tags: yelinati shani
Previous Post

మీకు తెలుసా..? రుద్రాభిషేకంలోనూ చాలా ర‌కాలు ఉన్నాయి..!

Next Post

ఆలివ్ ఆయిల్‌తో ఎన్ని అద్బుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Related Posts

lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025
వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.