Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

Sri Krishna : ఎన్టీఆర్ తో స‌హా టాలీవుడ్ లో శ్రీ‌కృష్ణుడి పాత్రలో న‌టించి మెప్పించిన హీరోలు వీళ్లే..!

Admin by Admin
November 18, 2024
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Sri Krishna : విష్ణుమూర్తి అవతారాల్లో మనకు అత్యంత ప్రీతి పాత్రమైన అవతారం కృష్ణ అవతారం. భగవంతుడు శ్రీకృష్ణుని గురించి ఎంత చెప్పినా త‌క్కువే అనిపిస్తుంది. ఆయన కథల గురించి ఎంత విన్నా కూడా ఇంకా వినాలనిపించే విధంగా ఉంటాయి. మన పూర్వీకులు నాటకాల రూపంలో, చిత్రపటాలలో మాత్రమే శ్రీకృష్ణుడిని చూసేవారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత శ్రీ కృష్ణ భగవానుడి గురించి ఎన్నో చిత్రాలు విడుదలయ్యాయి. కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు అని ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్లు ఉంచారు ఎందరో నటులు. ఇలా శ్రీ కృష్ణ భగవాన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

కృష్ణుడు అనగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు. దాదాపు 18 పౌరాణిక చిత్రాల్లో కృష్ణుడిగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో కృష్ణుడిగా తెలుగు ప్రజలను మెప్పించిన నటుడు కాంతారావు. తనదైన శైలిలో కృష్ణుడుగా నటించిన కాంతారావు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

telugu actors who acted as sri krishna in movies

ఎన్టీఆర్ కి నటనలో సమానులైన ఏఎన్నార్ పూర్తిస్థాయిలో కృష్ణుడి పాత్రలో నటించలేదు. కానీ గోవులగోపన్న చిత్రంలో ఒక పాటలో కృష్ణుని పాత్రలో కనిపించారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా బాపు దర్శకత్వంలో వచ్చిన సాక్షి చిత్రంలో ఒక సన్నివేశంలో కృష్ణుడిగా నటించారు. తెలుగు తెర‌పై శ్రీ‌కృష్ణుడిగా మెప్పించిన హీరోల్లో శోభ‌న్ బాబు కూడా ఒక‌రు. బాపు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బుద్ధిమంతుడు సినిమాలో మొద‌టిసారి శ్రీ‌కృష్ణుడి వేషంలో ద‌ర్శ‌నం ఇచ్చాడు నట భూషణ శోభ‌న్ బాబు. ఆ తరువాత క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన కురుక్షేత్రం సినిమాలో పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు శోభన్ బాబు.

ఎన్టీఆర్ వారసుడు నందమూరి హరికృష్ణ శ్రీకృష్ణావతారం చిత్రంతో బాలకృష్ణుడి పాత్రలో నటించి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. పాండురంగ మ‌హ‌త్యం సినిమాలో విజ‌య నిర్మ‌ల చిన్ని కృష్ణుడి పాత్ర‌లో న‌టించారు. అతిలోక సుందరి శ్రీదేవి కూడా యశోద కృష్ణ చిత్రంలో బాలకృష్ణుడిగా నటించింది. ఈ య‌శోద కృష్ణ సినిమాలోనే పెద్ద శ్రీ‌కృష్ణుడి పాత్ర‌లో న‌టించారు రామ‌కృష్ణ‌. ఈయ‌న ఎక్కువ సినిమాల్లో భ‌గ‌వంతుడి పాత్ర‌ల్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆ తర్వాత కాలంలో శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు చిత్రాలలో బాలయ్యబాబు కృష్ణుని పాత్రలో కనిపించారు. అదేవిధంగా అక్కినేని నాగార్జున కృష్ణార్జున చిత్రంలోనూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోపాల గోపాల చిత్రంలోనూ కృష్ణుడిగా సామాన్యుడి పాత్రలో కనిపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు యువరాజు చిత్రంలో కృష్ణుడిగా ఓ చిన్న సన్నివేశంలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.

Tags: sri krishna
Previous Post

Business Idea : రూ.5 వేలు పెట్టుబడి పెడితే చాలు.. నెలకు రూ.2 లక్షలు సంపాదించే అదిరిపోయే ఐడియా..!

Next Post

Garlic And Hibiscus Oil For Hair : ఊడిన జుట్టును కూడా మ‌ళ్లీ మొలిపించే నూనె ఇది.. ఎలా త‌యారు చేయాలంటే..?

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.