Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఈ ఆల‌యం వ‌ద్ద న‌దిలో స్నానం చేస్తే చాలు.. స‌క‌ల పాపాలు పోతాయి..!

Admin by Admin
March 14, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అక్కడ ఉన్న ఆ ఆలయాన్ని భూలోక స్వర్గం అని పిలుస్తుంటారు. సహజంగా దేవుళ్ళు నిల్చొని దర్శనం ఇస్తారు, లేదా కూర్చొని దర్శనమిస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శయన అంటే పడుకొని అనంత పద్మనాభ స్వామిలాగా దర్శనమిస్తుంటారు. అయితే ఇక్కడ స్వామి వారు ఎడమకాలిపై నిలబడి, కుడికాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో దర్శనం ఇస్తుంటారు. అలా ఎందుకు స్వామి వారు దర్శనమిస్తారు? ఈ దేవతా మూర్తిని దర్శించనప్పుడు సహజంగా ప్రతి భక్తునికి కలిగే ఆలోచనతోపాటు ఆశ్చర్యం. అయితే అందుకు కారణం లేకపోలేదని అంటున్నారు స్థానికులు. అలాగే విచిత్ర భంగిమలో నిల్చొని దర్శనమించిచ్చే ఈ ఆలయానికి సమీపంలో ఉన్న నదికి చాలా ప్రత్యేకత ఉంది. మరి స్వామివారు ఇలా దర్శన ఇవ్వడం వెనుక పురాణం కథ ఏమిటి? ఈ ఆలయ విశేషాలేంటో..ఈ ఆలయం ఎక్కడ ఉందో అన్న విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం…

తిరువిక్రమ పెరుమాళ్ అనే ఆలయం తమిళనాడు రాష్ట్రం, విలుప్పురం జిల్లాలో తిరుక్కోవళ్ళూర్ అనే గ్రామం ఉంది. ఇది విల్లిపురానికి ఉత్తరంవైపు 45కి.మీ దూరంలో ఉంది. ఇక్కడే తిరువిక్రమ పెరుమాళ్ అనే ఆలయం ఉంది. శ్రీమహావిష్ణువు 108 దివ్య క్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి. ఇక్కడ విష్ణువును ఉలగలంత పెరుమాళ్ గా, లక్ష్మి దేవిని పూంగుతై గా కొలుస్తున్నారు ఈ ఆలయాన్ని ఇది రెండువేల సంవత్సరాల కిత్రం పల్లవరాజులు నిర్మించారని ప్రశస్థి. దక్షిణ భారతదేశంలో ఎత్తైన స్థంబాలలో ఇది మూడొవదిగా ఈ ఆలయం నిర్మాణం అనేక దశలలో జరిగినట్లు ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఈ ఆలయంలో నాలుగు స్థంబాలున్నాయి. అందులో తూర్పువైపుగా ఉన్న స్థంభం 195 అడుగుల ఎత్తు ఉంది. అయితే దక్షిణ భారతదేశంలో ఎత్తైన స్థంబాలలో ఇది మూడవదిగా చెబుతారు.

visit the river once here at tiru vikrama temple

పూర్వం ఒక సారి దేవాలయం పక్కనే ఉన్న మృకండమహర్షి ఆశ్రమంలోని ఒక మూలకి ముగ్గురు ఆళ్వారులు వర్షం నుండి రక్షించుకోవడం కోసం అని అక్కడ నిల్చొన్నారు. అయితే వీరు ముగ్గరు ఆశ్రమంలో ఉన్న ఒక ఇరుకు గదిలో ఒక రాత్రి అంతా నిలబడి మాట్లాడుకుంటుండగా, వారి మధ్య ఎవరో నిలబడి ఉండటం వలన గది మరింత ఇరుకుగా ఉన్నట్లు అనిపించింది. అప్పుడు ఆ గదిలో వారికి పెరుమాళ్ విగ్రహం దర్శనమిచ్చింది. ఆ దృశ్యాన్ని చూసిన ఆళ్వారుల మనస్సు ఆనందంతో పులకరించింది. ఈ ఆలయంలోని మూలవిరాట్ పేరు తిరువిక్రమస్వామి.

ఈ ఆలయంలోని మూలవిరాట్ పేరు తిరువిక్రమస్వామి. ఈ స్వామి వారు సుమారు 21 అడుగుల ఎత్తు ఎడమకాలిపై నిలబడి కుడికాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో ఉంటారు. కుడిచేత శంఖం, ఎడమచేత చక్రం ధరించి ఉంటుంది. స్వామి వారి కుడిచేతి చూపుడు వేలు పైకి చూపెడుతూ భక్తులకు దర్శనిమిస్తారు. పూర్వం ఒకప్పుడు బలిచక్రవర్తి పాతాళానికి త్రొక్కిన తర్వాత ఇచట వెలసినట్లు స్థలపురాణం తెలుపుతున్నది. అందువల్లే స్వామి వారు ఒంటికాలిపైన నిలబడి ఉన్నారని స్థలపురాణం తెలియజేస్తున్నది. ఈ స్వామి వారిని తమిళంలో అయ్యన్నార్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి అమ్మవారి పేరు పుషవల్లి తాయార్. ఇక్కడ మరో విశేషం ఏంటంటే… ఈ ఆలయానికి ఆనుకుని పెన్నానది ప్రవహిస్తుంది. అయితే ఒకప్పుడు బ్రహ్మదేవుడు గంగలో కాళ్ళు కడుక్కుని ఇక్కడికి వచ్చి త్రివిక్రమ స్వామికి ఆరాధన చేసేవాడట. ఆ సమయంలో బ్రహ్మదేవుని పాదములకు ఉన్న గంగాజలం బొట్లు అక్కడ నేలపై పడి పెన్నా నదిగా మారినది. అందుకే ఈ నదిని కూడా గంగానది అంత పవిత్రంగా భావిస్తారు. ఈ పెన్నానదిని దర్శించినవారికి సర్వపాపాలు హరించుకుపోతాయి. ఇక బుషులు ముక్తి పొందిన స్థలంగా మరియు భూలోక స్వర్గంగా తిరుక్కోవళ్లూర్ ను పేర్కొంటారు.

Tags: tiru vikrama temple
Previous Post

ఈ ఆల‌యానికి వెళ్తే చాలు.. ఎలాంటి అప్పులు అయినా స‌రే తీరిపోతాయ‌ట‌..!

Next Post

శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెర‌గాలంటే.. రోజూ ఈ నీళ్ల‌ను తాగండి..!

Related Posts

lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025
వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.