భారతదేశం మొత్తం వివిధ రకాల మతాలు, సంస్కృతి విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. భారతదేశం ఆధ్యాత్మికతకు ఒక భూమి అంటారు. అటువంటి ఆధ్యాత్మికత కోసం ప్రపంచంలోని అని మూలల నుండి వచ్చి సందర్శిస్తుంటారు. మనదేశంలో పురాతన శిల్పకళలు, దేవాలయాలు మతాలు, ఆధ్యాత్మికత సారాంశంను ప్రతి రాష్ట్రంలోనూ కనుగొనవచ్చు. కొన్ని చెట్లు, పవిత్ర ఆధ్యాత్మిక శశ్తులు కలిగి ఉన్నాయని, కొన్ని సమయాల్లో దేవుళ్ళుగా పూజించేవారని చెప్పబడింది. అటువంటి ఆధ్యాత్మిక చెట్లలో రావి, కొబ్బరి చెట్టు, బాంగ్, గంధపు చెట్లు ఇండియాలో వివిధ రాష్ట్రాలలో పూజింపబడుతూ హిందూ మతంలో వీటిమీద ఎక్కువ నమ్మకం కలిగి ఉన్నారు. రావిచెట్టును పురుషుడుగాను, వేపచెట్టును స్త్రీగాను భావించి పూజించే ఆచారం అనాదిగా వస్తోంది. సాధారణంగా ఈ రెండు వృక్షాలు కలిసి గానీ విడివిడిగా గానీ దేవాలయ ప్రాంగణంలో కనిపిస్తుంటాయి. రావిచెట్టును విష్ణు స్వరూపంగాను, వేపచెట్టును లక్ష్మీ స్వరూపంగాను భావించి భక్తులు వాటికి ప్రదక్షిణలు చేస్తుంటారు.
రావిచెట్టు, వేప చెట్టు ప్రదక్షిణ చేయడానికి గల ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. పిల్లలు సరైన సమయంలో కలగకపోతే 28 సార్లు ఆ చెట్ల చుట్టూ ప్రదక్షిణం చేయడం చాలా చోట్ల చాలా కాలం నుంచి ఉన్నదే. దానికి వైద్యకారణం వెతికితే చిరంజీవి వంటి రావిచెట్టు పురుష అంశం కలది. వేపచెట్టు స్త్రీ అంశం కలది. ఈ రెండు కలసిన ప్రదేశం వద్ద ప్రదక్షిణలు చేయడం వలన శరీరం వాటి నుంచి ఆమ్లజనితము ఇట్టే గ్రహిస్తుంది. గర్భ దోషాలను అరికడుతుంది.ఎక్కువ రోజులు ప్రదక్షిణలు చేయడం ద్వారా వాటిపై నుండి పడిన సూర్యకిరణాల వల్ల గర్భకోశ శక్తి పెరిగి సంతానవంతులయ్యే అవకాశాలు ఉన్నాయి. శనిదోషం ఉన్నవారు రావిచెట్టుకు పూజచేయాలి. నమస్కరించి కౌగిలించుకుంటే అనేక దోషాలు పోతాయి.
ఈ రావిచెట్టు క్రిందే బుధ్ధుడికి జ్ఞానోదయమైంది. రావి చెట్టు కింద విశ్రమించిన తరువాత మహా జ్ఞానోదయం కలిగి సిద్ధార్ధుడు బుద్ధుడు అయ్యాడు. అందువల్లనే రావిచేట్టును బోధివృక్షం అంటారు. శ్రీక్రుష్ణుడు చివరిదశలో ఈ చెట్టు క్రిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరాడు. పద్మపురాణం, స్కంద పురాణం కూడా రావిచెట్టు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపమని చెబుతున్నాయి. ఇక రావిచెట్టు కింద సేద దీరడం వలన శని కారణంగా సంక్రమించిన దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మనసుకి ప్రశాంతత కలిగి రక్తపోటుకి సంబంధించిన వ్యాధులు రాకుండా నియంత్రిస్తుంది. ఇక రావిచెట్టుతో కలిసి పూజలందుకునే వేపచెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగివుంటుంది. వేప ఆకులను నీళ్లలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మసంబంధమైన వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.
ఇక వేపచెట్టు పైనుంచి వచ్చేగాలి కూడా క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. ఇలా ఈ రెండు వృక్షాలు ఇటు ఆధ్యాత్మిక పరంగాను అటు ఆరోగ్యపరంగాను మానవ మనుగడకు ఎంతో మేలుచేస్తున్నాయి కనుకనే దేవాలయ వృక్షాలుగా పూజలు అందుకుంటున్నాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.