Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

Rudraksha : ఏయే రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ? జ‌న్మ న‌క్ష‌త్రం ప్ర‌కారం ధ‌రించాల్సిన రుద్రాక్ష‌లు ఏమిటి ? తెలుసుకోండి..!

Admin by Admin
October 26, 2024
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Rudraksha: రుద్రాక్ష‌ల‌ను ధరించ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రుద్రాక్ష‌ల్లో అనేక ర‌కాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఏయే రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయి ? అస‌లు జ‌న్మ న‌క్ష‌త్రం ప్రకారం ఎవ‌రెవ‌రు ఎలాంటి రుద్రాక్ష‌ల‌ను ధ‌రించాలి ? రుద్రాక్ష‌ల‌ను ధరించే విష‌యంలో పాటించాల్సిన నియ‌మాలు ఏమిటి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

శివుడు మూడు నేత్రాల‌ను మూసి చాలా సంవ‌త్స‌రాల పాటు ధ్యానంలో ఉంటాడు. శివుడు ధ్యానం నుంచి క‌ళ్లు తెర‌వ‌గానే ఆయ‌న నేత్రాల నుంచి రాలిన కొన్ని భాష్పాలు గౌడ‌, మ‌ధుర‌, అయోధ్య‌, కాశీ వంటి క్షేత్రాల్లో ప‌డ్డాయి. అవే రుద్రాక్ష‌లుగా మారాయ‌ని చెబుతారు. అందువ‌ల్ల వాటిని ధ‌రిస్తే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

శివుడి నేత్రాల నుంచి మొత్తం 38 భాష్పాలు ప‌డ్డాయి క‌నుక రుద్రాక్ష‌లు కూడా అన్నే ఉన్నాయని చెబుతారు. కానీ వాటిలో కేవ‌లం కొన్ని మాత్ర‌మే మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. జ‌పం చేసుకుంటానికి, ధ‌రించ‌డానికి చిన్న రుద్రాక్ష‌ల‌ను వాడాలి. గురివింద గింజ ప‌రిమాణంలోని రుద్రాక్ష‌ల‌ను ఉప‌యోగించాలి. ఇవి రేగు పండు, ఉసిరికాయ ప‌రిమాణాల్లోనూ ల‌భిస్తున్నాయి.

రుద్రాక్ష‌ల‌న్నీ ధ‌రించ‌ద‌గిన‌వి కావు. కొన్ని అశుభాల‌ను క‌లిగిస్తాయి. ప‌గిలిన‌వి, పురుగులు ప్ర‌వేశించిన‌వి, గుండ్ర‌గా లేనివి, కండ‌లేనివి ధార‌ణ‌కు ప‌నికిరావు. వీటితో జ‌పం కూడా చేయ‌రాదు.

which type of rudraksha has to be wear according to birth star

* ఏక‌ముఖి రుద్రాక్ష‌ల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల అన్నీ శుభాలే క‌లుగుతాయి. ఈ రుద్రాక్ష‌లు శిశుడి ప్ర‌తిరూపం అని చెబుతారు. వ్య‌క్తి వికాసం, జ్ఞాన వృద్ధి, సంప‌ద క‌లుగుతాయి.

* ద్విముఖి రుద్రాక్ష‌ల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల కుండ‌లినీ శ‌క్తి పెరుగుతుంది.

* త్రిముఖి రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే అనారోగ్య స‌మ‌స్య‌లు పోతాయి.

* చ‌తుర్ముఖి రుద్రాక్ష‌ల వ‌ల్ల మాన‌సిక రోగాలు న‌యం అవుతాయి. విద్యార్థులు అయితే చ‌దువుల్లో రాణిస్తారు.

* గుండె జ‌బ్బులు ఉన్న‌వారు పంచ‌ముఖి రుద్రాక్ష‌ల‌ను ధ‌రించాలి. శ‌త్రువుల‌ను సుల‌భంగా జ‌యించ‌గ‌లుగుతారు. పాము కాటు నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

* ష‌ణ్ముఖి (ఆరు ముఖాలు) రుద్రాక్ష‌ల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల బీపీ, హిస్టీరియా త‌గ్గుతాయి.

* స‌ప్త‌ముఖి రుద్రాక్ష‌ల‌తో అకాల మ‌ర‌ణం సంభ‌వించ‌కుండా చూసుకోవ‌చ్చు.

* అష్ట‌ముఖి రుద్రాక్షలు వినాయ‌కుడికి ప్ర‌తిరూపం. కుండ‌లినీ శ‌క్తి పెరుగుతుంది.

* న‌వ‌ముఖి రుద్రాక్ష‌లు భైర‌వునికి ప్ర‌తీక‌. దుర్గా దేవిని ఆరాధించే వారు ధ‌రించాలి. ఎడ‌మ చేతికి ధ‌రించాల్సి ఉంటుంది.

* ద‌శ‌ముఖి రుద్రాక్ష‌ల‌తో అశ్వ‌మేథ యాగం చేసినంత ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. వీటిని స్త్రీలు ధ‌రించాలి.

* ఏకాద‌శ‌ముఖి రుద్రాక్ష‌లు శివుని 11 రూపాల‌కు ప్రతీక‌. దుష్ట శ‌క్తుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

* ద్వాద‌శ‌ముఖి (12 ముఖాలు) రుద్రాక్ష‌లు ఆద్యుల‌కు ప్ర‌తీక‌. గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి.

* త్ర‌యోద‌శ‌ముఖి రుద్రాక్ష‌లు కామ‌ధేనువు, కార్తికేయునికి ప్రతీక‌. అందం పెరుగుతుంది.

* చ‌తుర్ద‌శ‌ముఖి రుద్రాక్ష‌ల‌ను ప‌ర‌మ‌శివుని క‌ళ్లుగా భావిస్తారు.

* పంచ‌ద‌శ‌ముఖి రుద్రాక్ష‌లు శివుడికి ప్ర‌తిరూపం. ఆధ్యాత్మిక సాధ‌న పొందుతారు.

* షోడ‌శ‌ముఖి (16 ముఖాలు) రుద్రాక్ష‌లు క‌ల్పిమాడుకుకు ప్ర‌తీక‌.

* స‌ప్త‌ద‌శ‌ముఖి రుద్రాక్ష‌లు విశ్వ‌క‌ర్మ‌కు ప్ర‌తీక‌. సంప‌ద‌ను అందిస్తాయి.

* అష్దాద‌శ‌ముఖి (18 ముఖాలు) భూమికి ప్ర‌తిరూపం.

* ఏకోన్న వింశ‌తిముఖి (19 ముఖాలు) రుద్రాక్ష‌లు నారాయ‌ణుడికి ప్ర‌తి రూపం.

* వింశ‌తిముఖి (20 ముఖాలు) రుద్రాక్ష‌లు బ్ర‌హ్మ‌కు ప్ర‌తి రూపం.

జ‌న్మ న‌క్ష‌త్రం ప్ర‌కారం ధ‌రించాల్సిన రుద్రాక్ష‌లు..

  • అశ్విని – న‌వ‌ముఖి
  • భ‌ర‌ణి – ష‌ణ్ముఖి
  • కృత్తిక – ఏక‌ముఖి, ద్వాద‌శ‌ముఖి
  • రోహిణి – ద్విముఖి
  • మృగ‌శిర – త్రిముఖి
  • ఆరుద్ర – అష్ట‌ముఖి
  • పున‌ర్వ‌సు – పంచ‌ముఖి
  • పుష్య‌మి – స‌ప్త‌ముఖి
  • ఆశ్లేష – చ‌తుర్ముఖి
  • మ‌ఖ – న‌వ‌ముఖి
  • పుబ్బ – ష‌ణ్ముఖి
  • ఉత్త‌ర – ఏక‌ముఖి, ద్వాద‌శ‌ముఖి
  • హ‌స్త – ద్విముఖి
  • చిత్త – త్రిముఖి
  • స్వాతి – అష్ట‌ముఖి
  • విశాఖ – పంచ‌ముఖి
  • అనురాధ – స‌ప్త‌ముఖి
  • జ్యేష్ట – చ‌తుర్ముఖి
  • మూల – న‌వ‌ముఖి
  • పూర్వాషాఢ – ష‌ణ్ముఖి
  • ఉత్త‌రాషాఢ – ఏక‌ముఖి, ద్వాద‌శ‌ముఖి
  • శ్ర‌వ‌ణం – ద్విముఖి
  • ధ‌నిష్ట – త్రిముఖి
  • శ‌త‌భిషం – అష్ట‌ముఖి
  • పూర్వాభాద్ర – పంచ‌ముఖి
  • ఉత్త‌రాభాద్ర – స‌ప్త‌ముఖి
  • రేవ‌తి – చ‌తుర్ముఖి

న‌వ‌ర‌త్నాల‌కు బ‌దులుగా ఏయే రుద్రాక్ష‌ల‌ను ధ‌రించ‌వ‌చ్చో తెలుసుకోండి..

  • కెంపు – ఏక‌ముఖి, ద్వాద‌శ‌ముఖి
  • ముత్యం – ద్విముఖి, ఏకాద‌శ ముఖి
  • ప‌గ‌డం – త్రిముఖి, అష్టాద‌శ ముఖి
  • ప‌చ్చ – చ‌తుర్ముఖి, త్ర‌యోద‌శ ముఖి
  • పుష్య‌రాగం – పంచ ముఖి, చ‌తుర్ద‌శ ముఖి
  • వ‌జ్రం – ష‌ణ్ముఖి, పంచ ద‌శ ముఖి
  • నీలం – స‌ప్త‌ముఖి, షోడ‌శ ముఖి
  • గోమేధికం – అష్ట‌ముఖి
  • వైఢూర్యం – న‌వ‌ముఖి, అష్టాద‌శ ముఖి

రుద్రాక్ష‌ల‌ను ధ‌రించే విష‌యంలో పాటించాల్సిన నియ‌మాలు..

* రుద్రాక్ష‌ల‌ను ఎల్ల‌ప్పుడూ ప‌రిశుభ్రంగా ఉంచాలి. స‌రైన రూపంలో లేని రుద్రాక్ష‌ల‌ను, పురుగులు తిన్న రుద్రాక్ష‌ల‌ను, పాడైపోయిన రుద్రాక్ష‌ల‌ను ధ‌రించ‌కూడ‌దు.

* బంగారం, వెండి, రాగి తీగ‌లు లేదా సిల్కు దారంతో రుద్రాక్ష‌ల‌ను ధ‌రించాలి.

* సంభోగ స‌మ‌యంలో వీటిని ధ‌రించ‌రాదు. ఒక వేళ పొర‌పాటుగా ధ‌రిస్తే వెంట‌నే ఆవు పాలతో శుద్ధి చేయాలి.

* రుద్రాక్ష‌ల‌ను ధ‌రించేట‌ప్పుడు శివ పంచాక్ష‌ర మిత్రం ఓం న‌మ‌శ్శివాయ ను 108 సార్లు జ‌పిస్తే మంచిది.

* రుద్రాక్ష‌ల‌ను ధ‌రించే వారు ఏడాదికి ఒక్క‌సారి అయినా స‌రే మాల‌కు మ‌హాన్యాపూర్వ‌క ఏకాద‌శ రుద్రాభిషేకం చేయిస్తే మంచిది. ఈ అభిషేకాన్ని శివ‌రాత్రి రోజు చేయించాలి.

* రుద్రాక్ష‌ల‌ను ధ‌రించిన వారు ధూమ‌పానం, మ‌ద్య‌పానం చేయ‌రాదు. వెల్లుల్లి, ఉల్లిపాయ‌లు, మాంసాహారం తిన‌రాదు.

* త‌మ న‌క్ష‌త్రాల‌కు అనుగుణంగా రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే మంచి ఫ‌లితాలు ఉంటాయి. బీపీ, గుండె జ‌బ్బులు వంటి దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

Tags: rudraksha
Previous Post

Diabetes Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు షుగ‌ర్ వ‌చ్చిన‌ట్లే..!

Next Post

గుండెపోటు హెచ్చ‌రిక‌.. అక్క‌డ నొప్పులు వ‌స్తే ఏ మాత్రం విస్మ‌రించ‌వ‌ద్దు..!

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.