Soundarya : చ‌నిపోవ‌డానికి ముందు సౌంద‌ర్య మూడు ప్ర‌మాదాల నుండి త‌ప్పించుకుందా..?

Soundarya : అలనాటి అందాల తార సౌంద‌ర్య గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేయ‌డ‌మే కాక స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా మలయాళ, తమిళ ఇండస్ట్రీలలో కూడా చాలా సినిమాలలో కూడా నటించింది సౌందర్య. ఎప్పుడు కూడా ఎక్స్పోజింగ్ పాత్రలకు ఒప్పుకునేది కాదు. కేవలం ఫ్యామిలీ వుమెన్ లాగా సంప్రదాయమైన పాత్రలోని నటించేందుకు అంగీకరించిన సౌందర్య త‌న న‌ట‌న‌తోను ఎంతో మెప్పించింది. ఇప్పటికీ సౌందర్య చనిపోయి చాలా ఏళ్లు గడిచినా కూడా ఆమె అభిమానం మాత్రం ఇప్పటికీ తగ్గలేదు.

అసలు జీవితంలో ఏమి చూడకుండానే కేవలం పెళ్లయిన కొన్ని రోజులకే మూడు నెలల గర్భవతి గా ఉన్న సౌంద‌ర్య అలా ఫ్లైట్ ప్రమాదం లో మరణిస్తారని ఎవరు ఊహించలేదు. అయితే సౌంద‌ర్య చ‌నిపోక ముందు మూడు పెద్ద ప్ర‌మాదాలు నుండి త‌ప్పించుకుంద‌ట‌. టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన మానవ కోటేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో ఆమె గురించి కొన్ని కీలక వ్యాఖ్య‌లు చేశారు. సౌందర్య శివశంకర్ అనే సినిమాలో నటించే టైంలో సౌందర్య కూర్చున్న ప్లేస్ లోనే లైట్ మ్యాన్ కింద ప‌డిపోయాడు.

do you know that soundarya escaped from 3 accidents before her death

పై నుంచి వచ్చే శబ్దం విని ఆమె పక్కకు వెళ్లారని, 15 అడుగుల నుంచి ఆ వ్యక్తి కింద పడ్డాడని కోటేశ్వరరావు వెల్లడించారు. ఆ సమయంలో సౌందర్య అక్కడ ఉంటే మ‌ర‌ణించేదని ఆయ‌న అన్నారు. ఇలాంటి సంఘటనలు ఆ సమయంలో మరో రెండు చోటు చేసుకున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. సౌందర్య చనిపోవడానికి కొన్ని రోజుల ముందే ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఆమెకు ఎదురైన ప్రతి సంఘటనలోంచి బయటపడింది. కానీ చివరికి విమాన ప్రమాదం నుండి తప్పించుకోలేక పోయింది. ఇక సౌందర్య చివరిగా నటించిన సినిమా శివ శంకర్. కానీ ఆమె మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.