సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2002 ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం భీమ్లా నాయక్. మలయాళం లో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్ కొశియుమ్ చిత్రం రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో రానా మరో కీలక పాత్రలో నటించడం కూడా సినిమాకి హైప్ తీసుకొచ్చింది. ఈ చిత్రంలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతోపాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను అందించింది.
అయితే స్టార్ కాస్ట్ తర్వాత ఈ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించిన నటి మౌనిక రెడ్డి. ఈ సినిమాలో మౌనిక రెడ్డి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. సూర్య వెబ్ సిరీస్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న సెలబ్రిటీలలో మౌనిక రెడ్డి ఒకరు.
ఈ వెబ్ సిరీస్ మౌనిక రెడ్డి రేంజ్ ను పెంచడంతోపాటు ఆమెకు అభిమానులను కూడా పించింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ తో పవన్ కళ్యాణ్ పక్కన నటించే అవకాశాన్ని అందుకుంది. మౌనిక రెడ్డి వైజాగ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.
ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తూనే నటనపై ఉన్న మక్కువతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది. అలా ఓవైపు సిల్వర్ స్క్రీన్ ఛాన్స్ కోసం వేచి చూస్తూనే ఇంకోవైపు షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం మొదలు పెట్టింది. అలా సూర్య అనే వెబ్ సిరీస్ సక్సెస్ తో సినిమా ఆఫర్లు రావడం ప్రారంభమయ్యాయి.
ఇదొక్కటే కాకుండా నిఖిల్ 18 పేజెస్, విశ్వక్సేన్ ఓరి దేవుడా సినిమాలలో కూడా నటించింది. ఇక పెళ్లి కూడా చేసుకుని కాస్త గ్యాప్ తీసుకుంది. సందీప్ అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది మౌనిక రెడ్డి. ఈమె కెరీర్ లో మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.