చిన్నపిల్లలు ఏంటో మనం పెట్టింది తప్ప మిగతావి అన్నీ కావాలంటారు. మట్టి, సుద్ద, బలపాలు, బియ్యం వీటిలో ఏదో ఒకటి తినే అలవాటు కచ్చితంగా ఉంటుంది కదా..! కొంతమంది అయితే పెద్దయిన తర్వాత కూడా ఈ అలవాటు మానుకోలేరు. అసలు ఇలా మట్టి, సుద్ద తినే అలవాటు వల్ల దీర్ఘకాలం పాటు ఉంటే చాలా నష్టాలు ఉంటాయట. మట్టి, సుద్ద, జుట్టు, బూడిద, రాళ్లు లాంటివి తినే అలవాటు కొందరికి ఉంటుంది. ఈ అలవాటుకి కారణం ఉంది. దీనిని పికా అంటారు. ఈ రుగ్మతకు అనేక కారణాలు ఉంటాయి. ఐరన్ లోపం లేదా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వంటివి ఈ అలవాటుకు కారణాలు కావచ్చట. ఈ సమస్యతో బాధపడేవారిని ఆ అలవాట్లను వెంటనే మాన్పించాలి. లేదంటే తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుందట. సుక లేదా మట్టి తినడం వల్ల గ్యాస్ట్రిక్ నొప్పి, రక్తస్రావం కావచ్చట. పెయింట్ తినడం వల్ల శరీరం విషపూరితం అవుతుందట.
లోహపు వస్తువులు తినడం వల్ల ప్రేగు చిల్లు పడే ప్రమాదం ఉందట. గర్భిణీ స్త్రీలలో కూడా పికా అనే రుగ్మత కనిపిస్తుందట. వారు ఎక్కువగా సుద్ద వంటి వస్తువులను తినడానికి ఇష్టపడతారట. OCD లేదా స్కిజోఫ్రెనియా ఉన్న పెద్దవాళ్లు, పోషకాహార లోపం ఉన్న వ్యక్తులు, మానసికంగా లేదా శారీరకంగా వైకల్యం ఉన్న వ్యక్తులు ఈ పికా బారిన పడతారట.
పికా చికిత్సలో అనేక విధానాలున్నాయి. పోషకాహార లోపం వల్లనా? కాదా? అని నిర్ధారించడానికి ముందు వైద్యులు రక్త పరీక్షలు చేస్తారు. చికిత్స చేయకుండా వదిలేస్తే పికా సంవత్సరాల పాటు కొనసాగుతుంది. లేదంటే కోలుకోలేని నష్టం కలిగింవచ్చు. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూడాలంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలి.
తల్లిదండ్రులు పిల్లలు ఏం తింటున్నారు, ఎలా కూర్చుంటున్నారు వీటన్నింటిని గమనించాలి. చాలామంది పిల్లలు w ఆకారంలో కుర్చుంటారు. మోకాళ్లు ముందుకు పెట్టి పాదాలు వెనక్కు వచ్చేలా కుర్చుంటారు. మీరు చాలా సార్లు చూసే ఉంటారు. ఇలా అస్సలు కుర్చోనివ్వకూడదు. చాలా ప్రమాదకరం. వారి లేత లేత కండరాలు ఇలా కుర్చోవడం వల్ల దెబ్బతింటాయి. నోట్లు వేళ్లుపెట్టుకోవడం, ఇలా తినకూడనివి తినడం వీటన్నింటిని మొదట్లోనే మాన్పించేయాలి.