Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

చెవి ఇన్‌ఫెక్ష‌న్లు, నొప్పి స‌మ‌స్య‌ల‌కు ఇంటి చిట్కాలు..!

Sailaja N by Sailaja N
April 9, 2021
in చిట్కాలు
Share on FacebookShare on Twitter

మనలో చాలా మంది తరుచూ చెవి ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఎంతో బాధపడుతుంటారు. ముఖ్యంగా పెద్ద వారితో పోలిస్తే చిన్న పిల్లలు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. చెవి ఇన్ఫెక్షన్లకు ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. కొందరిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఆహారపు అలర్జీలు, పోషకాల లోపాలు, కొన్నిసార్లు చెవి లోపల అంతర్గత గాయాలు అయినప్పుడు, వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఈ విధంగా చెవిలో నొప్పి కలిగి ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. ఈ క్రమంలోనే చెవి నుంచి ద్రవం బయటకు రావడంతో తీవ్రమైన నొప్పిని కలిగించి ఎంతో బాధిస్తుంటుంది.

9 home remedies for ear infections and pain

కొందరిలో రెండు చెవులలో కూడా ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా రెండు చెవులు ఇన్ఫెక్షన్ కావడం వల్ల వినికిడి లోపం, ఇతర తీవ్రమైన సమస్యలను కలుగజేస్తుంది. కనుక చెవి ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడాలి. అందుకు మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ క్రమంలోనే ఆయా పదార్థాలను ఉపయోగించి చెవి ఇన్‌ఫెక్షన్ల నుంచి ఎలా బయట పడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉప్పు

ఉప్పు ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండే వంటింటి పదార్థం. చెవిలో ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి ఉప్పు ఎంతో ఉపయోగపడుతుంది. ఒక పాన్ మీద తక్కువ మంటలో ఒక కప్పు ఉప్పును ఐదు నిమిషాలు పాటు వేడి చేయాలి. ఈ విధంగా వేడి చేసిన ఉప్పును ఒక ఒక వస్త్రంలోకి పోసి దానిని రబ్బర్ బ్యాండ్ తో గట్టిగా ముడి వేయాలి.  వేడిగా ఉన్న ఉప్పును ఏ చెవిలో అయితే ఇన్ఫెక్షన్ ఉంటుందో ఆ చెవి పైభాగంలో ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆ వస్త్రాన్ని ఉంచాలి. ఈ విధంగా చేయటం వల్ల చెవి లోపల ఉన్నటువంటి ద్రవం మొత్తం బయటకు వచ్చి చెవి నొప్పి, వాపు నుంచి పూర్తిగా విముక్తి కలిగిస్తుంది. అయితే ఈ నివారణ పద్ధతిని రోజులో మనకు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చేయడం వల్ల తొందరగా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

2. వెల్లుల్లి

వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా చెవి నొప్పి సమస్యతో బాధపడేవారు రెండు వెల్లుల్లి రెబ్బలు, రెండు లవంగాలను తీసుకొని ఒక టేబుల్ టీస్పూన్ నువ్వుల నూనెలో బాగా వేడి చేయాలి. అలా వేడి చేసిన  నూనెను వడపోయాలి. ఈ నూనెను ఏ చెవిలో అయితే మనకు నొప్పిగా ఉందో ఆ చెవిలో రెండు చుక్కలు వేసుకోవటం వల్ల తక్షణమే చెవి నొప్పి సమస్య నుంచి విముక్తి కలగడమే కాకుండా ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

3. తులసి

పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నాలుగైదు తులసి ఆకులను తీసుకొని దంచి వాటి నుంచి రసం బయటకు తీయాలి. ఈ రసాన్ని చెవిలో వేసుకోవటం వల్ల తొందరగా నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది.  కొబ్బరినూనెలో తులసి రసాన్ని సమాన భాగంలో కలిపి అందులో కాటన్ బాల్ వేసి ఆ కాటన్ బాల్ తో చెవి లోపల, చెవి అంచు చుట్టూ, చెవి వెనుక మెత్తగా తుడవాలి. ఈ విధంగా చేయటం వల్ల త్వరగా చెవి ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవచ్చు.

4. ఆపిల్ సైడర్ వెనిగర్

ఒక భాగం ఆపిల్ సైడర్ వెనిగర్ ను సమానమైన నీరు లేదా ఆల్కహాల్ తో కలపాలి. ఈ ద్రావణంలో కాటన్ బాల్ వేసి ఆ కాటన్ బాల్ ను బాధిత చెవిలో ఐదు నిమిషాలపాటు పెట్టడం వల్ల తొందరగా చెవి నొప్పి సమస్య నుంచి విముక్తి కల్పిస్తుంది.

5. ఆలివ్‌ నూనె

కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను తక్కువ మంట వద్ద వేడి చేసి గోరువెచ్చగా ఉండే నూనెను రెండు చుక్కలు బాధిత చెవిలో వేసుకోవటం వల్ల నొప్పి నుంచి త్వరగా విముక్తిని కల్పిస్తుంది. ఆలివ్ ఆయిల్ మన చెవిలో పేరుకుపోయిన మైనాన్ని తొలగించి చెవిని శుభ్రపరుస్తుంది.

6. మెడ వ్యాయామాలు

తరచూ మెడకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల చెవి ఇన్ఫెక్షన్లు తగ్గే అవకాశాలు ఉంటాయి. నిటారుగా నిలబడి లేదా కూర్చుని ఈ మెడ వ్యాయామాలను చేయవచ్చు. మీ కుడి భుజానికి సమాంతరంగా కుడివైపుకు మెడను తిప్పి ఐదు నుంచి పది సెకన్ల పాటు సమాంతరంగా పట్టుకొని ఉండాలి. తరువాత ఇదే వ్యాయామాన్ని ఎడమవైపు కూడా చేయాలి. ఈ విధంగా తరచు చేస్తుండటం వల్ల చెవి ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి పొందవచ్చు.

7. చల్లని లేదా వెచ్చని కంప్రెస్

చల్లని లేదా వెచ్చని కంప్రెస్ రెండూ చెవిలో ఉన్న నొప్పిని తగ్గించడానికి దోహద పడతాయి. చల్లని లేదా వేడి వస్త్రాన్ని పది నుంచి పదిహేను నిమిషాల పాటు చెవి పైభాగంలో ఉంచుకోవటం వల్ల నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం కలుగుతుంది.

8. ముల్లేయిన్

ముల్లేయిన్ మొక్క పువ్వుల నుంచి తయారైన నూనె చెవి నొప్పి నివారణకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నూనె మనకు బయట దుకాణాల్లో లభ్యమవుతుంది.

9. ఉప్పు నీటిని పుక్కిలించడం

కొన్నిసార్లు చెవి నొప్పి రావడానికి గొంతుతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ముందుగా గొంతులో ఏర్పడిన ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవడం వల్ల చెవి నొప్పిని కూడా తగ్గించుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి ఆ నీటిని బాగా పుక్కిలించడం వల్ల చెవి నొప్పి నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు.

పై తెలిపిన చిట్కాలను ఉపయోగించి చెవి నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: ear healthear infectionsear painear problemsచెవి ఇన్‌ఫెక్ష‌న్లుచెవి నొప్పిచెవి స‌మ‌స్య‌లుచెవుల ఆరోగ్యం
Previous Post

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆలివ్ ఆయిల్‌.. దీన్ని వాడ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Next Post

రాత్రంతా నీటిలో నానబెట్టిన అంజీర్‌ పండ్లను ఉదయాన్నే తినండి.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..!

Related Posts

చిట్కాలు

మునగాకుల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా..? తెలిస్తే వెంట‌నే తిన‌డం మొద‌లు పెడ‌తారు..

July 20, 2025
చిట్కాలు

ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది..

July 20, 2025
చిట్కాలు

2 రూపాయల విలువైన ఈ ఒక్క వస్తువు వల్ల మీ దంతక్షయం నశిస్తుంది..!

July 20, 2025
చిట్కాలు

మ‌జ్జిగ‌లో వీటిని క‌లిపి తాగండి.. మ‌ల‌బ‌ద్దకం అన్న మాటే ఉండ‌దు..!

July 13, 2025
చిట్కాలు

వీటిని తాగితే చాలు.. కిడ్నీల్లో ఉండే ఎంత‌టి స్టోన్స్ అయినా స‌రే కరిగిపోతాయి..!

July 12, 2025
చిట్కాలు

అధిక బరువా.. పర‌గడుపున ఇది తాగండి ఇట్టే తగ్గుతారు..!!

July 11, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.