Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

టైఫాయిడ్‌ను తగ్గించేందుకు ఇంటి చిట్కాలు..!!

Admin by Admin
March 31, 2021
in చిట్కాలు
Share on FacebookShare on Twitter

కాలుష్యం అయిన నీరు లేదా ఆహార ప‌దార్థాల‌ను తీసుకున్న‌ప్పుడు వాటిల్లో ఉండే బాక్టీరియా ద్వారా టైఫాయిడ్ జ్వ‌రం వ‌స్తుంది. దీని వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ జీర్ణ‌వ్య‌వ‌స్థ నుంచి ర‌క్త ప్ర‌వాహంలోకి చేరుతుంది. ఫ‌లితంగా జ్వరం, త‌ల‌నొప్పి, క‌డుపునొప్పి, నీర‌సం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. సాల్మొనెల్లా టైఫి అనే బాక్టీరియా ద్వారా టైఫాయిడ్ వ‌స్తుంది. ఈ జ్వ‌రం తీవ్ర‌త పెరిగే కొద్దీ ల‌క్ష‌ణాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. అందువ‌ల్ల ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకోవాలి. జ్వ‌రం ఎక్కువ‌య్యే కొద్దీ వ‌ణుకు రావ‌డం, లివ‌ర్ పెర‌గ‌డం, ముక్కు నుంచి ర‌క్తం కార‌డం వంటి ల‌క్ష‌ణాలు కొంద‌రిలో క‌నిపిస్తాయి. ఇక కొంద‌రిలో జ్వ‌రం 104 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్ర‌త‌కు చేరుతుంది. అయితే జ్వ‌రం ఎంత‌కూ త‌గ్గ‌క‌పోతే దాన్ని టైఫాయిడ్‌గా అనుమానించాలి. వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.

home remedies for typhoid fever

టైఫాయిడ్ వ‌చ్చిన వారు వైద్యులు ఇచ్చే మందుల‌తోపాటు కింద తెలిపిన చిట్కాలు పాటించ‌వ‌చ్చు. దీంతో టైఫాయిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

1. ద్ర‌వాలు

టైఫాయిడ్ వ‌చ్చిన వారి శ‌రీరంలో ద్ర‌వాలు త్వ‌ర‌గా బ‌య‌ట‌కు పోతుంటాయి. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌తారు. అందుకు గాను ఎక్కువ‌గా ద్ర‌వాల‌ను తీసుకోవాలి. ముఖ్యంగా నీరు, పండ్ల ర‌సాలు, కొబ్బ‌రినీళ్లు, సూప్స్ తాగాల్సి ఉంటుంది.

2. ఓఆర్ఎస్

టైఫాయిడ్ వచ్చిన వారు ఓఆర్ఎస్ ద్రావ‌ణాల‌ను తాగాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. క‌నుక మెడిక‌ల్ షాప్‌ల‌లో వివిధ ర‌కాల ఫ్లేవ‌ర్ల‌లో దొరికే ఓఆర్ఎస్ ప్యాకెట్ల‌ను కొని తెచ్చి వాటిపై సూచించిన విధంగా ఓఆర్ఎస్ ద్రావ‌ణాల‌ను క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. లేదా ఒక లీట‌ర్ మ‌రిగించిన నీటిలో కొద్దిగా చ‌క్కెర‌, ఉప్పు క‌లిపి కూడా తాగ‌వ‌చ్చు. దీంతో శ‌రీరంలోకి మిన‌ర‌ల్స్ చేరుతాయి. చురుకుద‌నం వస్తుంది.

3. తుల‌సి

తుల‌సి ఆకుల్లో యాంటీ బ‌యోటిక్‌, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల టైఫాయిడ్‌కు అవి అద్భుతంగా ప‌నిచేస్తాయి. ఒక క‌ప్పు నీటిలో నాలుగైదు తుల‌సి ఆకులు వేసి కొద్దిగా మ‌రిగించి ఆ నీటిని తాగాలి. రోజుకు ఇలా 4 సార్లు తాగితే మంచిది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. టైఫాయిడ్ త‌గ్గుతుంది.

4. వెల్లుల్లి

టైఫాయిడ్ వ‌చ్చిన వారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. ప‌ర‌గ‌డుపునే రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది.

5. అర‌టి పండ్లు

జ్వ‌రం వ‌చ్చిన వారు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌ద‌ని కొంద‌రు న‌మ్ముతారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే అర‌టి పండ్ల‌లో పెక్టిన్ అనే స‌మ్మేళనం ఉంటుంది. ఇది ఒక ఫైబ‌ర్‌. దీని వ‌ల్ల చిన్న‌పేగులు మ‌నం తీసుకునే ద్ర‌వాల‌ను స‌రిగ్గా శోషించుకుంటాయి. ఫ‌లితంగా విరేచ‌నాలు అవ‌కుండా ఉంటాయి. అలాగే అర‌టి పండ్ల‌లో ఉండే పొటాషియం శ‌రీరం కోల్పోయే ఎల‌క్ట్రోలైట్స్ ను భ‌ర్తీ చేస్తుంది. దీంతో కూడా విరేచ‌నాలు అవ‌కుండా ఉంటాయి. టైఫాయిడ్ ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌డం మంచిది.

6. త్రిఫ‌ల చూర్ణం

సాధార‌ణ జ్వ‌రం లేదా టైఫాయిడ్ ఏది ఉన్నా స‌రే త్రిఫ‌ల చూర్ణం తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది. టైఫాయిడ్‌కు కార‌ణం అయ్యే సాల్మొనెల్లా టైఫి బాక్టీరియా న‌శిస్తుంది. త్రిఫ‌ల చూర్ణం పొడి, ట్యాబ్లెట్ల రూపంలో ల‌భిస్తుంది. డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు దీన్ని వాడుకోవాలి.

7. ల‌వంగాలు

టైఫాయిడ్ ఉన్న‌వారు ల‌వంగాల‌ను తింటే బాక్టీరియా నాశ‌నం అవుతుంది. ఒకటిన్న‌ర క‌ప్పు నీటిలో 3 ల‌వంగాలు వేసి బాగా మ‌రిగించాలి. త‌రువాత నీటిని వ‌డ‌క‌ట్టి తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది.

8. దానిమ్మ పండ్లు

టైఫాయిడ్ జ్వ‌రాన్ని త‌గ్గించేందుకు దానిమ్మ పండ్లు అద్భుతంగా ప‌నిచేస్తాయి. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. దీన్ని నేరుగా తిన‌లేని వారు జ్యూస్ రూపంలో కూడా తీసుకోవ‌చ్చు. ఎలా తీసుకున్నా దానిమ్మ పండ్ల‌లో ఉండే ఔష‌ధ గుణాలు టైఫాయిడ్‌ను, దాని ల‌క్ష‌ణాల‌ను త‌గ్గిస్తాయి.

ఇక ఇవే కాకుండా టైఫాయిడ్ వ‌చ్చిన వారు ఆహారం విష‌యంలోనూ జాగ్ర‌త్త వ‌హించాలి. తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారాల‌ను తీసుకోవాలి. ముఖ్యంగా ద్ర‌వాహారం ఎక్కువ‌గా తీసుకోవాలి. శ‌రీరానికి త‌గినంత విశ్రాంతి ఇవ్వాలి. ప‌రిశుభ్ర‌మైన నీటిని తాగాలి. శుభ్రంగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి. వేడిగా ఉన్న ఆహారాన్నే తినాలి. అలాగే నీటిని మ‌రిగించి చ‌ల్లార్చి తాగాలి. జ్వ‌రం బాగా ఉంటే చంక‌లు, పాదాలు, చేతులు, నుదురుపై త‌డిగుడ్డ‌తో తుడుస్తుండాలి. జ్వ‌రం త‌గ్గేవ‌ర‌కు మాటిమాటికీ ఇలా చేయాలి. దీంతో టైఫాయిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు.

Tags: typhoidtyphoid feverటైఫాయిడ్‌టైఫాయిడ్ జ్వ‌రం
Previous Post

మ‌న‌ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే 10 ఆహారాలు..!!

Next Post

ఉద‌యాన్నే వ్యాయామం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

Related Posts

చిట్కాలు

మునగాకుల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా..? తెలిస్తే వెంట‌నే తిన‌డం మొద‌లు పెడ‌తారు..

July 20, 2025
చిట్కాలు

ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది..

July 20, 2025
చిట్కాలు

2 రూపాయల విలువైన ఈ ఒక్క వస్తువు వల్ల మీ దంతక్షయం నశిస్తుంది..!

July 20, 2025
చిట్కాలు

మ‌జ్జిగ‌లో వీటిని క‌లిపి తాగండి.. మ‌ల‌బ‌ద్దకం అన్న మాటే ఉండ‌దు..!

July 13, 2025
చిట్కాలు

వీటిని తాగితే చాలు.. కిడ్నీల్లో ఉండే ఎంత‌టి స్టోన్స్ అయినా స‌రే కరిగిపోతాయి..!

July 12, 2025
చిట్కాలు

అధిక బరువా.. పర‌గడుపున ఇది తాగండి ఇట్టే తగ్గుతారు..!!

July 11, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.