పరిస్థితులను బట్టి అత్యంత ప్రమాదకరం అయిన విమానానికి నిర్వచనం మారిపోతుంది. ఒంటరిగా ఉన్న యుద్ధ విమానం కన్నా…integrated గా యుద్ధం చేసే విమానం అత్యంత ప్రమాదకరం. వాస్తవ పరిస్థితులలో అలాగే ఉంటుంది. ఒక విమానం అత్యంత ప్రమాదకరం అని చెప్పలేము. ఎందుకంటే Type of ఎంగేజ్మెంట్ ప్రధానం. ఠక్కున 5వ తరం యుద్ధ విమానం అని నేను అనను. Dog fight లో 4వ తరం యుద్దావిమానాలు 5వ తరం యుద్ధ విమానాల్ని ఉతికి ఆరవేయ గలవు. దానికి కారణం….. 5వ తరం విమానాలు ఎక్కువ missiles ని మోసుకు వెళ్లలేవు, కొన్ని 5వ తరం విమానాలకి gun కూడా ఉండదు.
F35 కి వేగం తక్కువ ఎందుకంటే అవి దూరం నుంచి శత్రువుని మట్టుపెట్టి కనుమరుగు అవ్వాలి అన్న యుద్ధ నీతి మీద ఆధారపడి ఉంటాయి. BVR లో అవి ప్రమాదకరం WVR లో కాదు. భారత్ పాక్ లాంటి యుద్దవాతవరణంలో with in the visual range గా యుద్ధం మారే అవకాశం ఎక్కువ. పక్క పక్కన ఉండటం వల్ల. అలాగే, F18 growler Electronic warfare దీని బలం. శత్రువు communication jam చేయగలదు, రాడార్ ని blind చేయగలదు, యుద్ధ విమానంలో ఎన్ని గొప్ప ఆయుధాలు ఉన్నా వాటిని ప్రయోగించలేని విధంగా కట్టి పడేయగలదు. కానీ, దీని turn rate, weight to thrust విషయం లో గొప్పది అని చెప్పలేము.
రఫెల్ గొప్ప multi role fighter కానీ Euro fighter typhoon Air to air రోల్ లో కాస్త మెరుగు. కానీ, Air to గ్రౌండ్ విషయం లో rafale కన్నా వెనుకబడి ఉంటుంది. High altitude Air field నుంచి పనిచేయవలసి వస్తే… naval air power projection పాత్ర లో …. ఇలా, ఒకటి అని చెప్పడం కష్టం.