చాలామందికి ఇండియాలో ఇలాంటి ట్రైన్స్ ఉన్నాయని తెలియదు. ఈ రైల్లో ఒకసారి ప్రయాణం చేస్తే మనకు మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. మరి ఇండియాలో టాప్ ఫైవ్ లగ్జరీ ట్రైన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మహారాజా ఎక్స్ప్రెస్.. దేశంలో ఉన్న లగ్జరీ రైళ్లలో మహారాజా ఎక్స్ప్రెస్ ఒకటి.IRCTC ప్రవేశపెట్టిన ఫ్లాగ్ షిప్ లగ్జరీ ట్రైన్. దీనిలో ప్రయాణం రాయల్ అనుభూతి పొందవచ్చు. ఇందులో డీలక్స్ క్యాబిన్లు, జూనియర్ క్యాబిన్స్ ప్రెసిడెన్షియల్ సూట్‌లు ఉంటాయి. ఈ రైల్లో రెస్టారెంట్లు కూడా ఉంటాయి. రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్.. ఈ రైలు రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాగే భారతీయ రైల్వేల జాయింట్ వెంచర్. ఇది రాజస్థాన్లోని రాజా గమ్యస్థానాలతోపాటు ఆగ్రా, ఖజురహో వారణాసి వంటి ప్లేస్ లను కవర్ చేస్తుంది. ఈ రైలు ఒక్కసారి ఎక్కామంటే మర్చిపోలేని అనుభూతి మిగులుతుంది.
రాయల్ ఓరియంట్.. ఈ రైలు 1994-95లో టూరిజం కార్పొరేషన్ ఆఫ్ గుజరాత్, భారతీయ రైల్వేల మధ్య జాయింట్ వెంచర్ గా వచ్చింది. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మధ్య నడుస్తుంది. ఇందులో ప్రయాణం రాయల్ ఫీలింగ్ ఇస్తుంది. ప్యాలెస్ ఆన్ వీల్స్.. ఇండియాలో ప్రవేశ పెట్టిన మొదటి లగ్జరీ రైలు ఇదే. ప్రపంచ సాయి ఆతిథ్యంతో పాటు ఐకానిక్ ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ ట్రైన్ లో అత్యధిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ లో మిమ్మల్ని కింగ్ క్వీన్ వలే సకల సదుపాయాలతో మర్యాదలు చేస్తారు.
డెక్కన్ ఒడిస్సి.. మహారాష్ట్రలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం దీన్ని 2005లో ప్రవేశపెట్టారు. ఇది కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో నడుస్తుంది. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలో మీదుగా నడుస్తుంది. ఇందులో అత్యధిక సౌకర్యాలతో కూడిన బాత్రూంలు, డీలక్స్ ఉన్నాయి. ఇందులో సెలూన్, బార్ లాంజ్, కాన్ఫరెన్స్ హాల్, మినీ జిమ్నాసీయం వంటి సేవలు అందిస్తుంది.