Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచి నీళ్ల బ్రాండ్లు ఇవే..! వాటి ధర ఎంతో, వాటి ప్రత్యేకత ఏంటో మీరే చూడండి!

Admin by Admin
March 28, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవే. వీటిని తాగితే ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు, బరువు తగ్గి, చర్మం నిగారింపును సంతరించుకుంటుందనీ ఒత్తిడి దూరమవుతుందనేది కొందరి నమ్మకం. ఇంతకీ అంత ప్రత్యేకత ఆ నీటికెలా వచ్చిందంటారా… హవాయి దగ్గర్లోని పసిఫిక్‌ సముద్ర తీరంలో రెండువేల అడుగుల లోతు నుంచి తీసుకొచ్చే నీరిది. ప్రత్యేక పద్ధతుల్లో ఆ నీటిలోని ఉప్పదనాన్ని పోగొట్టి బాటిళ్లలో నింపుతారు. సముద్రం కింద వేల అడుగుల లోతునుంచి వస్తాయి కాబట్టి, స్వచ్ఛంగా ఉండడంతో పాటు వీటిలో ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయట. కోనా నిగరి నీటికి జపాన్‌లో ఎంత డిమాండ్‌ ఉందంటే రోజుకి 80వేలకు పైగా బాటిళ్లు అక్కడకు దిగుమతి అవుతున్నాయి.

2. Bling H20 (బ్లింగ్‌ హెచ్‌ టూవో) – Price: 750మి.లీ రూ.2,680 (Rs 2680 / litre)

సెలెబ్రిటీల చేతిలో ఉండే మంచినీళ్ల బాటిల్‌ కూడా ఆకర్షణీయంగా ఉండాల్సిందే. ఎలాగూ ఖరీదైన నీళ్లను కొనేది వారే. ఈ సూత్రంతోనే తమ నీళ్ల బాటిల్‌ ధరను మరింతగా పెంచింది బ్లింగ్‌ హెచ్‌టూవో కంపెనీ. టెనెస్సీ దగ్గరున్న నీటి బుగ్గల నుంచి సేకరించిన జలంతో నింపే ఈ బాటిళ్లను స్వరోవ్‌స్కీ రాళ్లతో తీర్చిదిద్దుతారు. దాంతో బాటిల్‌ తయారీకి అయ్యే ఖర్చు కూడా అదనమన్నమాట.

these are the worlds most expensive waters

3. Veen (వీన్‌) – Price: 750మి.లీ రూ.1500 (Rs 1500 / 750 ml)

వీన్‌ నీటిని నోట్లో పోసుకున్న ప్రతిసారీ నాలుకకు ఏదో సుతిమెత్తని అనుభూతి కలుగుతుందట. కాలుష్యం లేకుండా పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం ఉన్న వివిధ ప్రాంతాల్లోని నీటి బుగ్గల నుంచి జలాన్ని సేకరించి బాటిళ్లలో నింపుతోంది ఫిన్లాండ్‌కి చెందిన వీన్‌ కంపెనీ. అలా లాప్‌లాండ్‌ నుంచీ ప్రపంచంలోనే ప్రకృతి సంపద ఎక్కువున్న దేశంగా గుర్తింపు పొందిన భూటాన్‌లోని హిమాలయ ప్రాంతం నుంచీ నీటిని సేకరించి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

4. 10 Thousand BC (10థౌజండ్‌ బీసీ) – Price: 750మి.లీ రూ.950 (Rs 950 / 750 ml)

కెనడాలోని వాంకోవర్‌ నగరానికి 200 మైళ్ల దూరంలో ఉన్న ఆ పర్వత ప్రాంతంలో ఎవరూ ఉండరు. జంతువులు కూడా కనిపించవు. అక్కడ ఆరువేల అడుగుల లోతుతో వాలుగా ఉండే హిమనీనదాలను కరిగించి బాటిళ్లలో నింపుతోంది 10థౌజండ్‌ కంపెనీ. ఈ చోటుకి ఎవరూ వెళ్లలేరు, జంతువులు కూడా ఉండవు కాబట్టి, అక్కడి నీరు కలుషితం అయ్యే అవకాశం ఉండదు. పైగా హిమనీనదాల నుంచి వచ్చే నీరు కాబట్టి, వీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందనీ చర్మం మీద ముడుతల్లాంటివి రావనీ చెబుతోంది సంబంధిత కంపెనీ.

5. Aqua Deco (ఆక్వా డెకో) – Price: 750మి.లీ రూ.800 (Rs 800 / 750ml)

పద్దెనిమిది వేల సంవత్సరాల కిందట ఘనీభవించిన హిమనీనదాల నుంచి సేకరించిన నీరిది. కెనడాకు చెందిన ఆక్వా డెకో ఉత్తమ నాన్‌ కార్బొనేటెడ్‌ స్ప్రింగ్‌ వాటర్‌గా 2007లో బంగరు పతకాన్ని కూడా సాధించింది.

6. Evion (ఎవియాన్‌) – Price: లీటరు రూ.600 (Rs 600 / litre)

1789లో ఫ్రాన్స్‌కి చెందిన మార్కిస్‌ అనే వ్యక్తి రోజూ వాకింగ్‌కి వెళ్తూ స్థానికంగా ఎవియాన్‌ లెస్‌ బెయిన్స్‌ దగ్గరున్న నీటి బుగ్గ దగ్గర నీరు తాగేవాడట. ఆ నీరు తాగడం మొదలుపెట్టాక అతడికున్న కిడ్నీ, లివర్‌ సమస్యలు నయమయ్యాయట. అదికాస్తా ప్రచారం కావడంతో ఆ నీటిని అమ్మడం వ్యాపారంగా మారింది. అదే తర్వాతి కాలంలో ఎవియాన్‌ బ్రాండ్‌గా విస్తరించింది. చాలామంది ప్రముఖులు ఈ నీటిని ప్రత్యేకంగా తెప్పించుకుని తాగుతారు. మనదేశంలోనూ ఆన్‌లైన్‌ ద్వారా ఈ బాటిళ్లను అమ్ముతున్నారు.

7. Lauquen Artes (లాక్వెన్‌ ఆర్టెస్‌) – Price: 750మి.లీ రూ.400 (Rs 400 / 750ml)

దక్షిణ అమెరికాలోని ఆండెస్‌ పర్వతాల దగ్గర ఎలాంటి కాలుష్యమూ లేని మారుమూల ప్రాంతంలో 1500 అడుగుల లోతుకు తవ్వి తీసిన నీరే లాక్వెన్‌ మినరల్‌ వాటర్‌. బాటిల్లో నింపే వరకూ గాలి కూడా తాకనంత స్వచ్ఛంగా ఉంటాయి ఈ నీళ్లు.. అంటూ ప్రచారం చేస్తున్నారు ఈ కంపెనీ నిర్వాహకులు.

Tags: expensive water
Previous Post

ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తి వంత‌మైన భాష‌లు ఇవే…9 వ స్థానంలో హిందీ.

Next Post

బట్టతల ఎందుకు వస్తుంది? పురుషులకే ఎక్కువగా వస్తుంది ఎందుకు?

Related Posts

హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025
mythology

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌.. గ‌రుడ పురాణంలో చెప్పారు..!

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.