ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన మూడు డయాబెటిస్ మెల్లిటస్ రకాలు: వివిధ రకాల కారణాల వల్ల కలిగే డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 1. 1వ రకం, డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 2, జెస్టేషనల్ డయాబెటిస్ (గర్భిణీలలో వచ్చే డయాబెటిస్). అయినా, అన్ని రకాల మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. మొదటి రకం డయాబెటిస్ సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా నాశనం చేయడం (ఆటోఇమ్యూనిటీ) వల్ల కలుగుతుంది. రెండవ రకం డయాబెటిస్‌లో ఇన్సులిన్ నిరోధకత వస్తుంది. దీనివల్ల అధికంగా ఇన్సులిన్ కావలసి వస్తుంది, బీటా కణాలు ఈ డిమాండ్ తట్టుకోలేనప్పుడు డయాబెటిస్ కలుగుతుంది.
జెస్టేషనల్ డయాబెటిస్‌లో కూడా ఇన్సులిన్ నిరోధకత కనిపిస్తుంది. జెస్టేషనల్ డయాబెటిస్ సర్వసాధారణంగా ప్రసవం తర్వాత తగ్గిపోతుంది, కానీ మొదటి రకం, రెండవ రకం మధుమేహాలు మాత్రం దీర్ఘకాలికంగా ఉంటాయి. 1921లో ఇన్సులిన్ అందుబాటులోకి రావడంతో అన్ని రకాలను నియంత్రించడం సాధ్యమయ్యింది. ఆహార అలవాట్ల మార్పు కూడా భాగమయినప్పటికీ, ఇన్సులిన్ ఉత్పత్తి లేని మొదటి రకంను నియంత్రించడానికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వటం తప్పనిసరి మార్గం. రెండవ రకం ఆహార అలవాట్ల మార్పు, యాంటీ డయాబెటిక్ మందుల వాడకం వల్ల, అప్పుడప్పుడు ఇన్సులిన్ వాడకం వల్ల నియంత్రించవచ్చు.
ఇంతకుమునుపు ఇన్సులిన్ ను పందుల క్లోమాల నుండి తీయబడేది, ప్రస్తుతం చాలా వరకు ఇన్సులిన్ ఉత్పత్తి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా జరుగుతుంది. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతులవల్ల ఉత్పత్తి చేయబడే ఇన్సులిన్ మానవ సహజ ఇన్సులిన్‌కు పూర్తి కాపీగా గాని, వివిధ ఆన్‌సెట్ అఫ్ యాక్షన్, యాక్షన్ చూపబడే సమయం ఉండే విధంగా తయారుచేయబడుతున్నాయి. ఇన్సులిన్‌ను ఇన్సులిన్ పంపుల ద్వారా నిర్విరామంగా అవసరానికి తగిన విధంగా సరఫరా చేయవచ్చు.