ఈ సూచ‌న‌ల‌ను పాటిస్తే షుగ‌ర్ ను కంట్రోల్ చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు..!

ఉదయం స్నాక్స్ తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. సరైన మోతాదులో అల్పాహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందంటున్నారు. ఉదయం ల్పాహారం అనంతరం మధ్యహ్నాం, రాత్రి భోజనం విషయంలో నియంత్రణ అవసరమంటున్నారు. తద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని సూచిస్తున్నారు. సరైన సమయంలో అల్పాహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. తద్వారా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. టైప్-2 డయాబెటీస్‌తో బాధపడే … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు..!

ప్రస్తుత ఉరుకుల పరుగులతో కూడిన జీవితం కారణంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికీ మధుమేహం వ్యాధి వచ్చేస్తోంది. అయితే, షుగర్​ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటే ఆ సమస్య ఎదురుకాకుండా కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. మధుమేహం సమస్య ఉన్న వారు ఫైబర్​, కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించడం, వ్యాయామం చేయడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని డాక్టర్​ డెవిడ్​ జెన్​కిన్స్​, డాక్టర్​ రిచర్డ్​ బెర్న్​స్టీన్​ … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు..!

షుగర్ వ్యాధి వచ్చిందంటే ఇక అంతే సంగతులని, జీవితం చాలావరకూ లేనట్టేనని, తీపి తినేందుకు, సుఖంగా జీవించేందుకు అవకాశం లేదని చాలామంది ఈ వార్త తెలీగానే బాధ పడిపోతారు కానీ నిజానికి సమతుల్య, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి జీవనశైలిలో గణనీయమైన మార్పులు చేయడం అవసరం. ఈ జీవనశైలి సర్దుబాట్లు, ఆహారంలో మార్పులు, వ్యాయామ దినచర్య, ఒత్తిడి క్రమమైన పర్యవేక్షణతో సహా, రక్తంలో స్థిరమైన చక్కెర స్థాయిలను తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. మధుమేహం … Read more

షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారు దూర ప్ర‌యాణం చేయ‌కూడదా..?

షుగర్ వ్యాధి కలవారు తమ వ్యాధి కారణంగా ప్రయాణాలు మానుకోవాల్సిన అవసరం లేదు. వీరు ప్రయాణాలు చేసేటపుడు ముందుగా కొన్ని అంశాలు ప్రణాళిక చేసుకోవాలి. మీరు ప్రయాణించేది దేశీయంగానైనా, విదేశాలలోనైనా లేక బీచ్ లేదా పర్వతాలు ఏదైనప్పటికి ఆ వ్యాధి కూడా మీతోనే వుంటుందని గుర్తుంచుకోండి. తగిన జాగ్రత్తలతో సురక్షితంగా ప్రయాణాలుచేస్తూ కూడా తమ వ్యాధిని నియంత్రణలో వుంచుకోవచ్చు. తగిన సలహా సంప్రదింపులకు వెనుకాడరాదు. షుగర్ స్ధాయిలలో హెచ్చు తగ్గులు గమనించినట్లయితే, తమ వైద్యులతో వీరు ఎల్లపుడూ … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి నిద్ర స‌రిగ్గా ఉండ‌ద‌ట‌.. సైంటిస్టుల వెల్ల‌డి..

డయాబెటీస్ రోగులకు నిద్ర సరిగా వుండదు. దీనికి కారణం రక్తంలో షుగర్ అధికంగా వుండటం. వీరి ఆహారం అధిక కేలరీలతో కూడినదై వుండటం, వీరు అధిక బరువు, మందకొడి జీవన విధానం కలిగి వుండటంతో వీరికి నిద్ర కూడా సరిగా వుండదని ఒక తాజా అధ్యయనం చెపుతోంది. రాత్రివేళ ఆరు గుంటలకంటే తక్కువ నిద్రిస్తే, వారిలో డయాబెటీస్, గుండె జబ్బు వచ్చే అవకాశాలు మూడు రెట్లు అధికం అని న్యూయార్క్, బఫెలో స్టేట్ యూనివర్శిటీ మరియు వార్విక్ … Read more

ఈ కూర‌గాయ‌ల‌ను రోజూ తింటే చాలు.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..!

ఇంట్లో ఏ కూర చేసిన టమాటా ఉండాల్సిందే. టమాట లేకపోతే ఆ కూర వంటడం కుదరదన్న భావనలో చాలా మంది ఉంటారు. అలాంటి టమాట.. షుగర్ పేషంట్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టమాటాల్లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సెడెంట్ రక్తంలోని షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. టమాటాల్లోని విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో.. డయాబెటిస్‌తో పోరాడే శక్తి మీకు వస్తుంది. టమాటను మీరు సలాడ్స్, కూరలు, జ్యూసుల … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.. ఎందుకంటే..?

మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు పదే పదే సూచిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల అది ఇతర అవయవాలని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల శారీరక రోజువారీ పనులు సరిగ్గా నిర్వర్తించే సామర్థ్యం తగ్గిపోతుంది. అధిక రక్త చక్కెర స్థాయి మూత్రపిండాల పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దీన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటారు. సరైన సమయానికి దీన్ని గుర్తించి చికిత్స చేయకపోతే అది ప్రాణాంతకం … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌మ పాదాల పట్ల ఈ జాగ్ర‌త్త‌లను తీసుకోవ‌డం త‌ప్ప‌నిసరి..!

డయాబెటీస్ వ్యాధి వున్న వారు వారి పాదాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దెబ్బ తగిలితే త్వరగా తగ్గదు. ఒక్కొకపుడు చివరకు అది కాలు తీసేయటం వరకు కూడా వస్తుంది. వీరికి కాళ్ళకే ఎందుకు సమస్య? రక్తంలోని అధిక గ్లూకోజ్ బాక్టీరియా బాగా పెరిగేలా చేస్తుంది. సాధారణంగా పాదాలు మనం శుభ్రంగా పెట్టుకోము. వాటికి దెబ్బ తగలటం కూడా తేలికే. దెబ్బ తాకినప్పటికి అది వారికి త్వరగా తెలియని పరిస్ధితి కూడా వుంటుంది. మరి డయాబెటిక్ రోగులు … Read more

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

నా వయసు 65 ఏళ్లు. గత నాలుగేళ్లుగా డయాబెటిస్ వ్యాధికి మందులు వాడుతున్నాను. రక్తంలోని చక్కెర ప్రమాణాలు దాదాపు సక్రమంగానే ఉన్నాయిగాని, నరాల బలహీనత, శృంగార సమస్యల వంటివి ఇబ్బంది పెడుతున్నాయి. ఆయుర్వేద మందులు రెండు నెలలు వాడితే ఈ వ్యాధి శాశ్వతంగా పోతుందని కొన్ని ప్రకటనలు చూశాను. అలాగే పంచకర్మల చికిత్స వల్ల కూడా ఇది సంపూర్ణంగా పోతుందని విన్నాను. ఇది నిజమేనా? సరియైన ఆయుర్వేద మందులు, సలహాలు తెలియజేయప్రార్థన. ఈ వ్యాధి గురించి ఆయుర్వేదంలో … Read more

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

మధుమేహం అనేది ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. మధుమేహానికి సంబంధించిన బ్లడ్ షుగర్ అసమతుల్యత శరీరంలోని ఇతర అవయవాలను మాత్రమే కాకుండా మన చర్మాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ బాధితుల్లో ఎక్కువగా పొడిబారిన చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. ఇది దద్దుర్లు, దురద, తరచూ ఇన్ఫెక్షన్ ఏదైనా కావచ్చు. పొడి చర్మ సమస్యలే కాకుండా, రక్తంలో చక్కెర అసమతుల్యత కారణంగా అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. బొబ్బలు, చర్మంపై ఎరుపు, ముదురు పాచెస్, బాక్టీరియల్ … Read more