షుగర్ వ్యాధి కలవారు తమ వ్యాధి కారణంగా ప్రయాణాలు మానుకోవాల్సిన అవసరం లేదు. వీరు ప్రయాణాలు చేసేటపుడు ముందుగా కొన్ని అంశాలు ప్రణాళిక చేసుకోవాలి. మీరు ప్రయాణించేది దేశీయంగానైనా, విదేశాలలోనైనా లేక బీచ్ లేదా పర్వతాలు ఏదైనప్పటికి ఆ వ్యాధి కూడా మీతోనే వుంటుందని గుర్తుంచుకోండి. తగిన జాగ్రత్తలతో సురక్షితంగా ప్రయాణాలుచేస్తూ కూడా తమ వ్యాధిని నియంత్రణలో వుంచుకోవచ్చు.
తగిన సలహా సంప్రదింపులకు వెనుకాడరాదు. షుగర్ స్ధాయిలలో హెచ్చు తగ్గులు గమనించినట్లయితే, తమ వైద్యులతో వీరు ఎల్లపుడూ సంప్రదిస్తూ వుండాలి. ఆహారం, వ్యాయామం, మందులు అన్ని పరిగణలోనికి తీసుకోవాలి. ట్రైను, బస్, లేదా విమానం వంటి ప్రయాణ సాధనాలన్నింటిలోను ప్రయాణించవచ్చు.
ప్రధానంగా తగిన శారీరక వ్యాయామం, ఆహార నియమాలు, అప్పటికి ఉపయోగించే మందులు వేసుకోవడం వంటివి ఆచరించాలి. అవసరమనుకుంటే, నేడు ఆధునికంగా అందుబాటులో వున్న గ్లూకోమీటర్ వంటి సాధనాలతో తమ షుగర్ స్ధాయి పరీక్షించుకుంటూండాలి. ఇన్సులిన్ ఉపయోగించేవారు తగిన పరిమాణాలలో ఇన్సులిన్ తమ వద్ద వుంచుకోవాలి.