Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home మొక్క‌లు

Nela Thangedu : ప్రకృతి అందించిన వరప్రదాయిని.. నేల తంగేడు.. ఈ మొక్కతో లాభాలెన్నో..!

Admin by Admin
December 13, 2021
in మొక్క‌లు
Share on FacebookShare on Twitter

Nela Thangedu : మన చుట్టూ ఉండే పరిసరాల్లో అనేక రకాల జాతులకు చెందిన మొక్కలు పెరుగుతుంటాయి. అయితే వాటిల్లో ఔషధ గుణాలు ఉంటాయనే సంగతి ఎవరికీ తెలియదు. అలాంటి మొక్కల్లో నేల తంగేడు మొక్క ఒకటి. దీని ద్వారా మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడేందుకు ఈ మొక్క భాగాలు పనిచేస్తాయి. దీంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Nela Thangedu plant is natures boon to humans it has many medicinal benefits

1. నేల తంగేడు చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకుంటే శరీరానికి పుష్టి, బలం లభిస్తుంది.

2. ఆవు నెయ్యి, చక్కెర, నేల తంగేడు చూర్ణంలను తీసుకుని తగిన భాగాల్లో కలిపి తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

3. నేల తంగేడు చూర్ణాన్ని దానిమ్మ పండ్ల రసంతో తీసుకుంటూ ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

4. నేల తంగేడు చూర్ణాన్ని పాలలో కలిపి తీసుకుంటే శరీరం కాంతివంతంగా మారుతుంది.

5. శృంగార సమస్యలతో బాధపడుతున్న పురుషులు ఈ చూర్ణాన్ని రోజూ పాలతో తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

6. నేల తంగేడు చూర్ణాన్ని ఖర్జూర పండుతో కలిపి తీసుకోవాలి. ఆకలి పెరుగుతుంది.

7. పాత బెల్లం, నేల తంగేడు చూర్ణం కలిపి తీసుకుంటే కడుపులో ఉండే మలినాలు, వ్యర్థాలు బయటకు పోతాయి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

Nela Thangedu plant is natures boon to humans it has many medicinal benefits

8. పాలలో ఈ చూర్ణం కలిపి తీసుకుంటూ ఉంటే కంటి సమస్యలు పోతాయి. దృష్టి సరిగ్గా ఉంటుంది.

9. నేల తంగేడు చూర్ణాన్ని రోజూ వాడుతూ ఉంటే షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి.

10. పటికబెల్లం, నేల తంగేడు చూర్ణం కలిపి తింటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

11. అరటి పండ్లలో ఈ చూర్ణాన్ని పెట్టి రోజూ తింటుంటే నేత్ర వ్యాధులు పోతాయి. రేచీకటి నుంచి బయట పడవచ్చు.

12. ఖర్జూరాలతో ఈ చూర్ణాన్ని కలిపి తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది. నోరు, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

13. తంగేడు చెట్టు కాండం మీది బెరడుతో సమంగా నువ్వుల‌ పిండి కలిపి పూటకు ఒక చెంచా చొప్పున రెండు పూటలా తీసుకోవాలి. 40 రోజుల పాటు తీసుకుంటే దీర్ఘకాలంగా వున్న అతిమూత్ర వ్యాధి త‌గ్గిపోతుంది.

14. ఈ మొక్క విత్తనాలను వేయించి చూర్ణం చేసి కాఫీ గింజలతో కలిపి కాఫీ చేసుకుని తాగితే గుండె దడ తగ్గిపోతుంది. దీంతో వ‌చ్చే నీరసం, కళ్ళు తిరగడం తగ్గుతాయి.

15. తంగేడు మొక్క లేత ఆకులు గుప్పెడు తీసుకుని రెండు చిటికెల గవ్వ పలుకుల బూడిద కలిపి టాబ్లెట్స్ లా చేసి రోజుకు రెండు తీసుకోవాలి. వీర్యవృద్ధి కలిగి సంతానం కలిగే అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయి.

16. తంగేడు మొక్క పుల్ల‌ల‌ను తెంచి వాటితో దంతాల‌ను తోముకోవ‌చ్చు. దీంతో దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు తగ్గిపోతాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది.

17. దీర్ఘకాలంగా ఉన్న తెల్లబట్ట వ్యాధి తగ్గడానికి ఈ మొక్క‌ వేరు బెరడు నూరి ఆవు మజ్జిగలో కలిపి తీసుకుంటారు.

18. కడుపు నొప్పితో బాధపడే పిల్లలకు కాండం మీది బెరడుతో కాషాయం కాచి ఇస్తే తక్షణ‌మే ఉపశమనం కలుగుతుంది.

19. విరిగిన ఎముకలకు పట్టుగా తంగేడు ఆకులు వాడుతారు. విరిగిన లేదా బెణికిన ఎముకల భాగం సరిచేసి, తంగేడు పత్రాలు మెత్తగా నూరి కోడిగుడ్డు తెల్లసొనలో కలిపి పైన పట్టుగా వేసి కట్టుకడతారు. దీనివలన వాపు తగ్గి పుండు ఏర్ప‌డ‌కుండా త్వరగా ఎముక అతుక్కుంటుంది.

20. నోటిపూతతో బాధపడుతున్న పిల్లలకు ఈ మొక్క ఆకుల‌ను నూరి మాత్రలుగా చేసి ఇస్తే వారం రోజులకు పూత, పుండు తగ్గుతాయి.

21. తంగేడు పువ్వుల రెక్క‌ల‌ కషాయం మధుమేహానికి దివ్యౌషధంగా ప‌నిచేస్తుంది. పరగడుపున తంగేడు పువ్వుల‌ను తీసుకుని వాటిలో 15 రెక్క‌ల‌ను సేక‌రించాలి. వాటిని ఒక‌ గ్లాసుడు నీళ్ళలో వేసి మరిగించి చ‌ల్లార్ఛి సేవించాలి. ఇది తీసుకున్న త‌రువాత ఒక గంట వ‌ర‌కు ఏమీ తీసుకోరాదు. ఇలా 40 రోజుల పాటు చేస్తే గుణం క‌నిపిస్తుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

22. ఈ చెట్టు వేరు కషాయం కాచుకొని తాగుతుంటే నీళ్ల విరేచనాలు త‌గ్గిపోతాయి. 5 ఎంఎల్‌ తంగేడు చెట్టు బెరడు రసాన్ని రోజుకి ఒకసారి చొప్పున 3 రోజులపాటు తాగితే టాన్సిల్స్ సమస్య తొలగిపోతుంది.

23. తంగేడు చెట్టు లేత ఆకుల‌ను నమిలి మింగితే దగ్గు తగ్గుతుంది. తంగేడు చిగుళ్లు దంచి కడితే తేలు విషం విరిగి మంట తగ్గిపోతుంది. తంగేడు లేత ఆకుతోపాటు రెండు వెల్లుల్లి రెబ్బ‌లు, రెండు మిరియాలు కలిపి మెత్తగా నూరి ముద్దచేసి ఒకే రోజున మూడు మోతాదుల‌ పెరుగు అనుపానంతో కలిపి ఇస్తే చీముతో కూడిన విరేచనాలు తగ్గుతాయి.

24.తంగేడు ఆకుని నీడలో ఎండ‌బెట్టి పొడి చేయాలి. ఆ చూర్ణాన్ని గోరువెచ్చటి నీటితో రోజూ తీసుకోవడం వల్ల మలబద్దకం తగ్గుతుంది.

25. తంగేడు ఆకు చిగుళ్ల‌ను మెత్తగా నూరి పెరుగులో కలుపుకుని పరగడుపున తాగితే నీళ్ల విరేచనాలు త‌గ్గిపోతాయి. తంగేడు చిగుళ్లను మజ్జిగలో నూరి పాదాలకు రాస్తుంటే కాలిపగుళ్ళు తగ్గుతాయి.

26. తంగేడు లేత చిగుళ్ల‌ను మాడుమీద వేసి గట్టిగా తలకు కడుతుండాలి. దీంతో తలపోటు, తలనొప్పి త‌గ్గిపోతాయి. నేత్రరోగాలు నివారించ‌బ‌డ‌తాయి.

మార్కెట్‌లో మనకు నేల తంగేడు చూర్ణం లభిస్తుంది. దీన్ని కొనుగోలు చేసి ఉపయోగించవచ్చు. లేదా ఆకులను, పువ్వులను నీడ‌లో ఎండ బెట్టి పొడి చేసి ఆ చూర్ణాన్ని స్వల్ప మోతాదులో వాడుకోవచ్చు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో ఇలా వాడుకోవాల్సి ఉంటుంది.

Tags: Nela Thangeduనేల తంగేడు
Previous Post

Copper Ring : రాగి ఉంగరం ధరించడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!

Next Post

Onion Juice : శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే ఉల్లిపాయ‌ల ర‌సం.. ఇంకా ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

Related Posts

మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
మొక్క‌లు

ఎన్నో రోగాల‌కు చెక్ పెట్టే ఆకులు ఇవి.. వీటి పొడిని రోజూ తీసుకోవాలి..

May 20, 2025
మొక్క‌లు

ర‌ణపాల మొక్క‌.. అంద‌రూ తెలుసుకోవాల్సిన విష‌యాలు..

May 14, 2025
మొక్క‌లు

కిడ్నీల్లో ఉండే ఎంత‌టి రాళ్ల‌ను అయినా స‌రే క‌రిగించే ఆకు ఇది.. క‌నిపిస్తే విడిచిపెట్ట‌కండి..

May 11, 2025
మొక్క‌లు

ఈ ఆకుల‌ను రోజూ తీసుకుంటే చాలు.. మీ షుగ‌ర్ అమాంతం త‌గ్గిపోతుంది..

May 9, 2025
మొక్క‌లు

పత్తి మొక్క వ‌ల్ల ఇన్ని ప్ర‌యోజనాలు క‌లుగుతాయా..?

May 1, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.