Rashmika Mandanna : ర‌ష్మిక మంద‌న్న.. నీకంత పొగ‌రు ఎందుకు ? నెటిజ‌న్ల ఆగ్ర‌హం..!

Rashmika Mandanna : పుష్ప సినిమా ఇచ్చిన హిట్ కార‌ణంగా ర‌ష్మిక మంద‌న్న ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమె ప్ర‌స్తుతం ప‌లు బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తోంది. ఇక ఆమె హిందీలో న‌టిస్తున్న గుడ్‌బై అనే సినిమా షూటింగ్‌కు గాను తాజాగా రిషికేష్ వెళ్తోంది. అందులో భాగంగానే ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అక్క‌డ ఆమె మీడియా ప్ర‌తినిధుల కంట‌బ‌డింది. దీంతో ఆమెను ఫొటోలు తీసేందుకు ఎగ‌బ‌డ్డారు.

netizen angry on Rashmika Mandanna for not closing door
Rashmika Mandanna

అయితే ర‌ష్మిక మంద‌న్న కారు డోరు తీసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చింది. కానీ డోరు మ‌ళ్లీ వేయ‌లేదు. దీంతో త‌న ప‌క్క‌నే ఉన్న స‌హాయక వ్య‌క్తి ఆ డోర్ వేశాడు. ఈ క్ర‌మంలోనే ర‌ష్మిక మంద‌న్న చేసిన ఈ పనికి కొంద‌రు నెటిజ‌న్లు ఆమెను విమ‌ర్శిస్తున్నారు. నీకు డోర్ వేసేంత స‌మ‌యం కూడా లేదా.. అంత పొగ‌రు, గ‌ర్వం ఎందుకు.. కాస్తంత మాన‌వ‌త్వం చూపించు.. అంటూ ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆమె కార్ డోర్ తీసి బ‌య‌టకు రాగానే మాస్క్ ధ‌రించి ఉండ‌డంతో అది తీయ‌మ‌ని మీడియా సిబ్బంది అడిగారు. దీంతో ఆమె ఆ మాస్క్ తీసి ఫొటోల‌కు పోజులు ఇచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

త‌రువాత మీడియా అడ‌గ‌డంతో ఆమె త‌గ్గేదేలే.. అని డైలాగ్ చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ఈ క్ర‌మంలోనే ర‌ష్మిక మంద‌న్న‌కు చెందిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక ఈమె ప్ర‌స్తుతం న‌టిస్తున్న గుడ్‌బై అనే బాలీవుడ్ మూవీలో అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా యాక్ట్ చేస్తున్నారు. దీంతోపాటు సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి హిందీలోనే మిష‌న్ మ‌జ్ను అనే మూవీలోనూ ర‌ష్మిక మంద‌న్న యాక్ట్ చేస్తోంది. త్వ‌ర‌లో పుష్ప 2 షూటింగ్‌లో ఈమె పాల్గొన‌నుంది.