ఈ విష‌యం తెలిస్తే ఇక‌పై మీరు ప్లాస్టిక్ వ‌స్తువుల‌నే వాడ‌రు..!

మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకం ఒక భాగమైంది. కానీ దాని వల్ల పర్యావరణం లో జరిగే నష్టాలు గురించి కనీస అవగాహన కూడా మనకు ఉండటం లేదు. ప్లాస్టిక్ వస్తువులు చూడటానికి చక్కగా ఆకర్షణీయంగా కనబడతాయి. కానీ ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమైనది అని 1930 సంవత్సరంలోనే ఈ సత్యం బయట పడింది. ఒక ప్లాస్టిక్ వస్తువు భూమిలో కరగటానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది.

రోజూ రోజుకి పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడానికి 1999 సంవ‌త్స‌రంలోనే అప్ప‌టి పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్లాస్టిక్ పెట్రోలియం నుండి తయారు అవుతుంది. ప్రపంచం మొత్తం మీద రోజుకి 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. పెట్రలియం నుండి తయారు చేసిన ప్లాస్టిక్ తో ఇంట్లోకి కావలసిన పదార్థాలు క్యారీ బ్యాగ్ లు, కవర్లు వాడి పడేయడం వల్ల అవి భూమిలో కొన్ని వేల సంవత్సరాల వరకు అలాగే ఉండి పోతాయి.

you will not use plastic if you know this

అలా వుండటం వల్ల వర్షపు నీటిని భూగర్భ జలాలతో కలవనివ్వడం లేదు. ప్లాస్టిక్ తయారీకి వాడే రసాయనాల‌ వల్ల కొన్ని రకాల శ్వాస కోశ వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తాయి. ప్లాస్టిక్ తగలబెట్టడం వల్ల డయోక్సిన్ అనే వాయువు గాలిలో కలిసి క్యాన్సర్ కు కారణం అవుతుంది. ప్లాస్టిక్ ని భూమిలో కరిగే విధంగా 20 మైక్రాన్ ల కంటే తక్కువ మందం ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీలైనంతవరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. వ‌స్త్రంతో తయారు చేసిన సంచులు, జ్యూట్ తో చేసిన సంచులు, పేపర్ సంచులు అన్నింటికీ ఉపయోగించాలి.